దేశాధ్యక్షుడి చెంప చెల్లుమనిపించిన భార్య.. వీడియో వైరల్

సాధారణంగా భార్యాభర్తలు పోట్లాడుకోవడం పోట్లాడుకోవడం మనం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంటాయి. సిటీల్లోనూ అక్కడక్కడా మనం చూస్తుంటాం. కానీ రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధానులు, అధ్యక్షుల నుంచి ఇలాంటి సంఘటనలు అసలు ఊహించం కదా. ఈ క్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చెంప చెల్లుమనిపించింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వియత్నాంలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా విమానంలోనుంచి కిందకు దిగుతుండగా మెక్రాన్ సతీమణి బ్రిగిటే ఆయన్ను చెంపపై కొడుతున్న దృశ్యాలు విమానం కింద ఆయనకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన వారు చూశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. అయితే దీనిపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. మెక్రాన్ పై ఆయన సతీమణి బ్రిగిటే కావాలని చేయిచేసుకోలేదని.. అది టీజ్ చేసేందుకు అలా కొట్టిందని వివరణ ఇచ్చింది.

Viral Video Shows Brigitte Macron Slapping President Emmanuel Macron

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కు చెందిన అధికారిక విమానం ఆదివారం రాత్రి వియత్నాంలోని హనోయిలో ల్యాండ్ అయింది. కొద్ది క్షణాల తర్వాత డోర్లు ఓపెన్ అయ్యాయి. అయితే అప్పుడు ఓ దృశ్యం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెక్రాన్ ను ఆయన భార్య చెంపపై కొడుతున్నట్లు ఉంది. వెంటనే మెక్రాన్ తేరుకుని ఆమె చేతిని నెట్టివేశారు. ఆ తర్వాత మెక్రాన్ భార్య బ్రిగిటే విమానంలోనే ఉండిపోయింది. బయటకు రాలేదు. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై ఫ్రాన్స్ లో తీవ్ర స్పందన వస్తోంది. ఇది దేశానికే అవమానకరమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది భార్యాభర్తల విషయం అని కొందరు చెబుతున్నారు. మెక్రాన్ తన భార్యతో క్లోజ్ గా మూవ్ అయ్యారని.. ఆమె భర్తపై చేతులు వేసిందని సాక్షులు తెలిపారు. మరికొందరు మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఇక మెక్రాన్ సౌత్ ఈస్ట్ ఏషియా టూర్ లో భాగంగా వియత్నాంలో పర్యటించారు. వియత్నాంతో పలు ఒప్పందాలు చేసుకుంది ఫ్రాన్స్ ప్రభుత్వం. వియత్నాం తర్వాత మెక్రాన్ ఇండోనేషియా, సింగపూర్ లోనూ పర్యటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+