పుతిన్ ఫిట్‌నెస్: రెండు గంటలు స్మిమ్మింగ్, ప్రత్యేక ఆహర అలవాట్లు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ఫిట్‌నెస్ కోసం గంటల తరబడి కష్టపడతాడు. సాధారణంగా పుతిన్ జీవనశైలి రోటీన్‌కు భిన్నంగా ఉంటుంది. రాత్రిపూట గంటల తరబడి ఈత కొడుతూ గడుపుతాడు. మద్యానికి దూరంగా ఉంటాడు.
రాత్రి పూట త్వరగా నిద్రపోవాలని పుతిన్ భావిస్తాడు. కానీ, ఆయన మాత్రం ఇంతవరకు ఆ పనిచేయలేదు. రాత్రి పూట ఆలస్యంగా పడుకొంటాడు. ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తాడు. అయితే మధ్యాహ్న భోజన సమయానికి పుతిన్ అల్పాహరం తీసుకొంటాడు.

ఓ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ బెన్‌జాదూ అనే రిపోర్టర్ ఇటీవల ఫ్రాగైల్ ఎంపైర్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో పుతిన్ దినచర్యకు సంబంధించిన వివరాలున్నాయి.
రాత్రిపూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేస్తాడని ఆ పుస్తక రచయిత పేర్కొన్నాడు. బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు ఓట్ మీల్‌తో పాటు, ఒక పెద్ద ఆమ్లెట్ తీసుకొంటారు. దీనితో పాటు ఉడికించిన గుడ్డును పుతిన్ తింటారు. అంతేకాదు పండ్ల రసాన్ని తాగుతారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాఫీ తాగుతారు.
పుతిన్ తీసుకొనే ఆహరం పాట్రియార్క్ కిరిల్ అనే అధ్యాత్మిక వేత్తకు చెందిన ఫార్మ్‌లాండ్ స్టేట్ నుండి వస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కనీసం రెండు గంటల పాటు ఈత కొట్టేందుకు సమయాన్ని కేటాయిస్తారు.












Click it and Unblock the Notifications