ట్రం‌ప్‌కు షాక్: సిరియాపై దాడులు చేస్తే ఊరుకోం, తగ్గని అమెరికా: పుతిన్ వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu
  సిరియాపై ఆంక్షల విషయంలో అమెరికా వెనక్కు తగ్గాలి : పుతిన్

  మాస్కో: సిరియాపై అమెరికా దాడులకు తెగబడుతున్న తరుణంలో రష్యా మరోసారి అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది.సిరియాపై మరోసారి దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.

  సిరియాపై అమెరికా ఇటీవల కాలంలో దాడులకు తెగబడుతోంది. అయితే సిరియాపై అమెరికా దాడులపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ తరహ దాడుల పట్ల రష్యా అభ్యంతరం వ్యక్తం చేసింది.

  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీరును నిరసిస్తూ రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానం వీగిపోయింది. సిరియాపై అమెరికా దాడులను బ్రిటన్ సహ కొన్ని దేశాలు సమర్ధించాయి. నాలుగు దేశాలు మాత్రం వ్యతిరేకించాయి.

  అమెరికాకు పుతిన్ వార్నింగ్

  అమెరికాకు పుతిన్ వార్నింగ్

  సిరియాపై అమెరికా దాడులను రష్యా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరహ దాడులు పునరావృతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. సిరియాపై మరోసారి దాడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన అమెరికాకు తేల్చి చెప్పారు. సిరియాపై ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడ ఆయన హెచ్చరించారు.

  సిరియా అధ్యక్షుడితో పుతిన్ ఫోన్ సంభాషణ

  సిరియా అధ్యక్షుడితో పుతిన్ ఫోన్ సంభాషణ

  సిరియా అధ్యక్షుడు హసన్‌ రౌహనీతో ఫోన్‌‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. సిరియాపై పశ్చిమ దేశాల దాడులు, శాంతి చర్చలకు విఘాతం కల్గించేవిగా ఉన్నాయని పుతిన్‌తో రౌహన్ చెప్పారు. ఈ అభిప్రాయంతో పుతిన్ ఏకీభవించారు. ఐక్యరాజ్యసమితి నిబంధనావళిని ఉల్లంఘించేవిగా అమెరికా వ్యవహరిస్తోందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.

  సిరియాపై వెనక్కు తగ్గాలి

  సిరియాపై వెనక్కు తగ్గాలి

  సిరియాపై ఆంక్షల విషయంలో అమెరికా వెనక్కు తగ్గాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్ చేశారు. ఆంక్షలపై వెనక్కు తగ్గాలని పుతిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష భవనం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. సిరియాపై ఆంక్షలను విధించాలని అమెరికా నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో రష్యా తాజాగా చేస్తున్న డిమాండ్ మరోసారి అగ్రరాజ్యాల మధ్య వేడిని పుట్టిస్దోంది.

  ఆంక్షలపై అమెరికా అలానే

  ఆంక్షలపై అమెరికా అలానే

  అమెరికా మాత్రం ఆంక్షలపై తగ్గేలా కన్పించడం లేదు. సిరియాకు రసాయనిక ఆయుధాలను సరఫరాను చేస్తున్న సంస్థలను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అయితే అమెరికా ఆంక్షలు విధిస్తున్న సంస్థల్లో ఎక్కువగా రష్యాకు చెందినవిగా ఉన్నాయని అమెరికా అభిప్రాయపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే తాము ఆంక్షలు విధించినట్టు అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Russian President Vladimir Putin warned on Sunday that further Western attacks on Syria would bring chaos to world affairs, as Washington prepared to increase pressure on Russia with new economic sanctions.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి