నేను పిరికిపందను కాదు.. పుతిన్‌లా ఎక్కడా దాక్కోలేదు..! తన లొకేషన్ షేర్ చేసిన జెలెన్‌స్కీ !!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే బాంబుల వర్షం కురిపిస్తోంది. నివాస ప్రాంతాలపై రాకెట్లతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌తో పాటు సుమీ, మరియూపోల్, ఖార్కీన్ నగరాల్లో తాత్కాలికంగా కాల్పులను విరమిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. కానీ అచరణలో మాత్రం అమలు చేయటంలేదు. సుమీలో నివాస సముదాయాలపై రష్యా వైమానిక దళాలు బాంబులతో దాడులకు దిగాయి. ఈ దాడుల్లో చిన్నారులతో సహా పలువురు మృతిచెందారు.

జెలెన్‌స్కీ హ‌త్య‌కు కుట్ర‌లు

జెలెన్‌స్కీ హ‌త్య‌కు కుట్ర‌లు

రష్యా దండాయాత్రతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు జెలెన్ స్కీ హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను హత్య చేసేందుకు కిరాయి గూండాలను ఉక్రెయిన్‌కు పంపారంటూ జెలెన్ స్కీ కూడా అనేక మార్లు ఆరోపించారు. అమెరికాతో పాటు ఐరోపా దేశాలు తాము రక్షణ కల్పిస్తామంటూ జెలెన్‌స్కీకి ఆహ్వానాలు పంపాయి. కానీ వారి అభ్యర్థనలను ఉక్రెయిన్ అద్యక్షుడు తిరస్కరించారు. తాను దేశాన్ని వీడేది లేదని తేల్చిచెప్పారు. రష్యాతో సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

 ఎక్కడకి పారిపోలేదు.. దాక్కోలేదు..

ఎక్కడకి పారిపోలేదు.. దాక్కోలేదు..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనను సైనికులు బంకర్‌లోకి తరలించినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆవార్తలను జెలెన్ స్కీ కొట్టిపారేశారు. తాను ఎక్కడకి పారిపోలేదు.. దాక్కోలేదని తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన అధికారిక కార్యాలయంలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈమేరకు తన లొకేషన్‌ను చూపిస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను పిరికిపందను కాదు.. తమ దేశ ప్రజల కోసం ఇక్కడే ఉంటానని తేల్చిచెప్పారు.

పుతిన్‌లా పిరికిపంద‌ను కాదు.


తమ రాజధాని కీవ్‌లోని బాంకోవా స్ట్రీట్‌లోనే తాను ఉన్నట్లు జెలెన్ స్కీ తెలిపారు. తాను ఎవరికీ భయపడేది లేదు.. ఎక్కడ దాక్కోలేదని వెల్లడించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌లా పిరికిపంద‌ను కాదు. ఈ యుద్ధంలో గెలవడం కోసం ఎంత చేయాలో అంత తమ శక్తివంచన లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఈమేరకు తన అధికారిక కార్యాలయంలో ఉండి మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. రష్యా తమపై గత 12 రోజులుగా దాడులు చేస్తోంది. తాము తీవ్రంగా ప్రతిఘటిస్తూ పోరాటం చేస్తున్నామన్నారు.

 ర‌ష్యాకు భ‌య‌ప‌డేది లేదు..

ర‌ష్యాకు భ‌య‌ప‌డేది లేదు..

తాను కీవ్‌లోనే తన బృందంతో కలిసి పనిచేస్తున్నామని జెలెన్ స్కీ తెలిపారు. ఈ పోరాటంలో సైనికులే కాదు, డాక్లర్లు, జర్నలిస్టులు, దౌత్తవేత్తలు , పౌరులు ఇలా అందరూ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధపోరులో కచ్చితంగా తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. శత్రుదేశంతో పోల్చితే మనకు ఆయుధాలు లేకపోవచ్చు. కానీ మన ధైర్యమే మన ఆయుధం.. సామాన్య పౌరులు సహితం యుద్ధరంగంలో సై అంటున్నారు. ఇది మన దేశం.. మన నేల . రష్యా దాడులకు , దురాక్రమణ చర్యలకు భయపడేది లేదన్నారు. ఎదురొడ్డి పోరాడుదామంటూ దేశ ప్రజలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. రష్యా సేనలకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+