పుతిన్‌కు పదవీచ్యుతి- రష్యాకు కొత్త అధ్యక్షుడు: మాస్కోను చుట్టుముట్టిన ఆర్మీ
మాస్కో: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. అంతర్యుద్ధం మొదలైందక్కడ. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కుడిభుజంలా ఉంటూ వచ్చిన వాగ్నర్ మెర్సినరి గ్రూప్.. తిరుగుబాటును లేవనెత్తింది. రష్యా సైన్యం వాగ్నర్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడమే దీనికి కారణమైంది. ఈ ఘటన తరువాత వాగ్నర్ గ్రూప్ అడ్డం తిరిగింది. అంతర్యుద్ధాన్ని మొదలుపెట్టింది.
కొన్ని గంటల వ్యవధిలోనే ఇది ఉధృత రూపాన్ని దాల్చింది. రెండు నగరాలు- రొస్టొవ్, వొరొనెజ్‌ను సైతం వాగ్నర్ గ్రూప్ సొంతం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా నగరాల్లో పహారాలో ఉన్న రష్యా సైనికులు- ఈ ప్రైవేట్ ఆర్మీకి లొంగిపోయింది. వొరొనెజ్ టౌన్ శివార్లలోని ఆయిల్ డిపో ధ్వంసమైంది. ఇందులో నుంచి దట్టమైన పొగలు వెలువడటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల‌్‌గా మారాయి.

అక్కడితో ఆగలేదు వాగ్నర్ గ్రూప్. మాస్కో నగరాన్ని చుట్టుముట్టింది. దీన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఎంతో సమయం పట్టకపోవచ్చంటూ ప్రకటించింది. తమ ప్రైవేట్ ఆర్మీ మాస్కో శివార్లల్లో మోహరించిందని, రష్యా సైన్యంతో పోరాడుతోందంటూ తెలిపిందా సంస్థ. మాస్కోను స్వాధీనం చేసుకున్న వెంటనే దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవీచ్యుతుడిని చేస్తామని వెల్లడించింది.
ఈ పరిణామాల మధ్య పుతిన్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తిరుగుబాటును అతిపెద్ద తప్పుగా అభివర్ణించారు. తిరుగుబాటుదారులను అణచివేస్తామని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని అన్నారు. తిరుగుబాటుకు సిద్ధపడిన వారందరికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశామని తెలిపారు.

తన ప్రసంగంలో ప్రిగోజిన్ పేరు ప్రస్తావించలేదాయన. తిరుగుబాటుదారులకు నాయకత్వాన్ని వహిస్తోన్న వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. పుతిన్ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ప్రిగోజిన్ మాట్లాడారు. పుతిన్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తోన్నట్లు ప్రకటించారు. పుతిన్ చేసిన ప్రకటన అత్యంత సాహసోపేతమైనదని, దీన్ని తాను స్వీకరిస్తోన్నానని చెప్పారు. అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
రష్యాకు కొత్త అధ్యక్షుడు రాబోతోన్నాడని స్పష్టం చేశారు ప్రిగోజిన్. ఇప్పటికే తన ప్రైవేట్ ఆర్మీ మాస్కోను చుట్టుముట్టాయని, దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎంతోసమయం పట్టకపోవచ్చని అన్నారు. మాస్కోను స్వాధీనం చేసుకున్న వెంటనే పుతిన్‌ను పదవీచ్యుతుడిని చేస్తామని, ఆయన స్థానంలో కొత్త నాయకుడిని అధిష్ఠింపజేస్తామని చెప్పారు. తన ప్రైవేట్ ఆర్మీలో చేరాలంటూ రష్యా సైన్యానికి సూచించారు.
రొస్టొవ్, వొరొనెజ్ నగరాలు తమ ఆధీనంలో ఉన్నాయని చెప్పారు ప్రిగోజిన్. మరిన్ని నగరాలు తమ ఆధీనంలోకి రాబోతోన్నాయని అన్నారు. చాలాచోట్ల రష్యా సైన్యం స్వచ్ఛదంగా తమకు లొంగిపోతోందని పేర్కొన్నారు. రష్యాలో సివిల్ వార్ మొదలైందంటూ అధికారికంగా ప్రకటించారు. అటు ఉక్రెయిన్ నుంచి కూడా ఆ దేశ సైన్యం.. రష్యా దక్షిణ ప్రాంతం వైపు సరిహద్దులు దాటినట్లు వివరించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications