Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాగ్నర్ చీఫ్ దుర్మరణం: పుతిన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన రెబెల్

మాస్కో: రష్యాలో విమాన ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఓ బిజినెస్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 10 దుర్మరణం పాలయ్యారు. అందులో ప్రయాణిస్తోన్న వారిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. పైలెట్, క్రూ, ప్రయాణికులందరూ మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతుల జాబితాలో మెర్సినరీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెని ప్రిగోజిన్ ఉండటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్‌‌ను ఉటంకించింది. మృతుల్లో ప్రిగోజిన్ ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించినట్లు పేర్కొంది.

Prigozin

మాస్కో నుంచి 10 ప్రయాణికులతో ఈ బిజినెస్ ఫ్లైట్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరింది. పైలెట్, కోపైలెట్, ఒక ఫ్లైట్ సిబ్బంది, వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ సహా మొత్తం ఆరుమంది అందులో ఉన్నారు. మార్గమధ్యలో ట్వెర్ రీజియన్ గగనతలంపై ప్రయాణిస్తోన్నప్పుడు ఈ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. కుప్పకూలింది.

ఈ ఘటనలో అందులో ఉన్న వారందరూ మరణించారు. ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు రష్యా అత్యవసర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని వివరించింది. దీనితో ప్రిగోజిన్ కూడా మరణించి ఉంటారని పేర్కొంది. టాస్ న్యూస్ ఏజెన్సీ మాత్రం ఆయన మరణించినట్లు తెలిపింది.

ప్రిగోజిన్.. రెండు నెలల కిందట ప్రపంచం మొత్తానికీ చిరపరిచితమైన పేరు ఇది. రష్యాలో అంతర్యుద్ధాన్ని లేవదీసిన తిరుగుబాటు నేతగా గుర్తింపు పొందారు. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కుడిభుజంలా ఉంటూ వచ్చిన వాగ్నర్ మెర్సినరి గ్రూప్ ప్రైవేట్ ఆర్మీకి ఆయనే అధినేత.

అంతర్యుద్ధాన్ని లేవనెత్తిన తరువాత ఒక్కసారిగా వాగ్నర్ గ్రూప్, దాని చీఫ్ ప్రిగోజిన్ వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతుడైన దేశాధినేతల్లో ఒకడైన వ్లాదిమిర్ పుతిన్‌ను సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న వాగ్నర్ గ్రూప్ అంటే ఏంటీ?, ఎవరీ ప్రిగోజిన్.. అనేది చర్చనీయాంశమైంది.

ప్రిగోజిన్ వయస్సు 62 సంవత్సరాలు. తనకంటూ ఓ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. అందులో పని చేస్తోన్న వారిలో మెజారిటీ సంఖ్యలో ఖైదీలే. అందుకే దీనికి మెర్సినరీ గ్రూప్‌గా పిలుస్తుంటారు. గతంలో పుతిన్‌కు అత్యంత ఆప్తుడు కూడా. ఒకరకంగా కుడి భుజంగా పేరు తెచ్చుకున్నాడు.

Prigozin

ముద్దుగా ఆయనను పుతిన్ షెఫ్‌గా పిలుస్తారు. సుమారు రెండు దశాబ్దాల పాటు రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం క్రెమ్లిన్‌కు క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ను కుదుర్చుకోవడమే దీనికి కారణం. 1980లో జైలు శిక్షను అనుభవించాడు ప్రిగోజిన్. విడుదలైన తరువాత తన స్వగ్రామంలో హాట్‌డాగ్‌లను విక్రయించడం మొదలుపెట్టాడు.

ఆ తరువాత సూపర్ మార్కెట్ల వ్యాపారంలో అడుగు పెట్టాడు. కొంతకాలం తరువాత సొంతంగా రెస్టారెంట్, క్యాటరింగ్ కంపెనీని ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్లు అప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్ డిప్యూటీ మేయర్ వ్లాదిమిర్ పుతిన్‌ను బాగా నచ్చాయి. దీనితో- తన షెఫ్‌గా అపాయింట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ప్రిగోజిన్‌కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఆయన క్యాటరింగ్ సంస్థ ద్వారా ప్రభుత్వ సంస్థలకు ఆహారం, భోజనాలను సరఫరా చేసే ఒప్పందాలను కుదుర్చుకుంది. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం ప్రిగోజిన్ జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రైవేట్ మిలిటరీ గ్రూప్‌ను స్థాపించడానికి దారి తీసింది. వాగ్నర్ గ్రూప్‌ను నెలకొల్పారు. లిబియా, సిరియా, సెంట్రల్ ఆఫ్రికన్, మాలి వంటి దేశాలకు సేవలందించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+