పేజర్ల తర్వాత పేలిన వాకీటాకీలు: 9 మంది మృతి, పలువురికి గాయాలు

లేబనాన్ (Lebanon)లో మరోసారి ఊహించని రీతిలో దాడులు చేసుకున్నాయి. వేలాది పేజర్లు పేలిపోయిన ఘటన మరువకముందే.. తాజాగా వాకీటాకీ (Walkie Talkies)పేలాయి. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన హెజ్బుల్లా సభ్యులు, ఓ చిన్నారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

దేశంలోని పలు ప్రాంతాల్లో వాకీటాకీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పేలాయని.. ఈ ఘటనల్లో తొమ్మిది మంది మృతి చెందారని, 300 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు, బీరూట్ లోని అనేక ప్రాంతాల్లో గృహావసరాలకు వినియోగించే సౌరశక్తి వ్యవస్థలు పేలినట్లు అధికారిక మీడియా వెల్లడించింది.

Walkie-talkies explode after pagers in Lebanon 9 dead many injured

లెబనాన్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని హెజ్బుల్లా కూడా ప్రకటించింది. వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపింది. కాగా, లెబనాన్, సిరియాల్లో మంగళవారం ఒకేసారి వందలాది పేజర్లు పేలిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.

ఈ పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 2800 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్ లోని ఇరాన్ రాయబారితోపాటు హెజ్బుల్లా కీలక నేతలున్నారు. అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఆరోపిస్తున్నారు.

ఇటీవల లెబనాన్.. ఆధునాతన కమ్యూనికేషన్ పరికరాలను కొనుగోలు చేసింది. ఇందులోనూ ఇజ్రాయెల్ పేలుడు పదార్థాలు అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానిస్తోంది. ఓ వైపు పేజర్లు, మరోవైపు వాకీటాకీలు పేలడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం పేలుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+