యుఎస్ షూటర్: బౌద్ధాలయంలో ధ్యానం చేసేవాడు
వాషింగ్టన్: వాషింగ్డన్ నేవీ యార్డులో కాల్పులకు తెగబడిన ఆరోన్ ఎలెక్సిస్ బౌద్ధ ఆలయంలో నిత్యం ధ్యానం చేసేవాడని తెలుస్తోంది. అటువంటి వ్యక్తి కాల్పులకు తెగబడి 12 మందిని ఎలా చంపగలిగాడనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వాషింగ్టన్ నేవీ యార్డులో ఆరోన్ జరిపిన కాల్పుల్లో 12 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
అయితే, ఆరోన్ ఆలెక్సిస్ గతంలో తీవ్రమైన బాధలు పడ్డాడని, ఆగ్రహంతో ఊగిపోయేవాడని అంటున్నారు. స్వభావరీత్యా చాలా మౌనంగా ఉండే అలెక్సిస్ ఆగ్రహం వచ్చినప్పడు మాత్రం గన్‌ను వాడేవాడని చెబుతున్నారు. అతను 2007 నుంచి 2011 వరకు నేవీలో పనిచేశాడు.

సైన్యం నుంచి అతను ఎందుకు బయటికి వచ్చాడనేది తెలియదు. నేవీలో ఒకతను తనను ఇష్టపడేవాడు కాదని, అందుకే బయటకు వచ్చానని అలెక్సిస్ ఒక సందర్భంలో చెప్పినట్లు అతని ల్యాండ్ లార్డ్ చెప్పాడు. సర్వీసులో ప్రవర్తన సరిగా ఉండేది కాదని, పని సరిగా చేసేవాడు కాదని, లేదంటే చెప్పాపెట్టకుండా వదిలేసి వెళ్లిపోయేవాడని అమెరికా సైనికాధికారి ఒకరు చెప్పారు.
గతంలో కూడా అతను గన్‌ను వాడినట్లు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశంలో అతను ఓసారి కారు టైర్లపైకి కాల్పులు జరిపాడు. తన పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో ఆ పని చేసినట్లు ఆ తర్వాత చెప్పాడు. ఆగ్రహంతో ఊగిపోయేవాడు గానీ చాలా మౌనంగా ఉండేవాడని, ఇతరులకు సహాయం చేసేవాడని అతని బంధవులు, మిత్రులు అంటున్నారు.
ఆరోన్ అలెక్సిస్ ఇతరులను చంపేవాడు కాదని, అతను కాల్పులకు పాల్పడి మనుషులను చంపాడని తెలిసి ఆశ్చర్యపోయామని వారంటున్నారు. సైన్యంలో ఉన్నప్పుడు అతను రెండు అవార్డులు పొందాడు. నేషనల్ సర్వీస్ డిఫెన్స్ సర్వీస్ మెడల్, గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజం సర్వీస్ మెడల్ అతను పొందాడు.












Click it and Unblock the Notifications