యుద్ధం మొదలైతే: ఉ.కొరియా క్షిపణి దాడిచేస్తే.. అమెరికాకు అంత సత్తా లేదా?

ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేస్తే చేయవచ్చును గానీ, ఉ.కొరియా ప్రయోగించే క్షిపణులను ఎదుర్కోవడం కష్టమేనని రష్యా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాషింగ్టన్: ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేస్తే చేయవచ్చును గానీ, ఉ.కొరియా ప్రయోగించే క్షిపణులను ఎదుర్కోవడం కష్టమేనని రష్యా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రష్యా పారెన్ మినిస్టర్ సెర్జే లావ్‌రోవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికా.. ఉత్తర కొరియాను ఎదుర్కోలేదని చెప్పారు.

యుద్ధమే మొదలైతే

యుద్ధమే మొదలైతే

ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే అమెరికాలోని గువామ్‌ ద్వీపానికి కష్టాలు తప్పకపోవచ్చని వారు భావిస్తున్నారు. వివిధ దశల్లో ఉన్న అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థకు ఒక ఖండాంతర క్షిపణిని ఛేదించేంత సత్తాలేదని భావిస్తున్నారు. సాధారణంగా ఉ.కొరియా ప్రయోగించే క్షిపణి దాదాపు 770 కి.మీ. ఎత్తులో జపాన్‌ మీదుగా ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు.

కూల్చలేదు.. అమెరికాకు అంత సీన్ లేదా?

కూల్చలేదు.. అమెరికాకు అంత సీన్ లేదా?

అమెరికా మూడంచెల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అవి ను పరిశీలిస్తే దీనిలో పేట్రియాట్‌, థాడ్‌, ఏజిస్‌. ఇవి వరుసగా 12. 125, 1,350 మైళ్ల దూరం ప్రయాణిస్తాయని అంచనా. ఏ క్షిపణిని అయినా ఇవి తుది, టెర్మినల్‌, స్టేజ్‌ దశలో కూల్చేందుకు సిద్ధం చేసినవి. కానీ వీటిల్లో ఏ ఒక్కటి ఖండాంతర క్షిపణిని ఛేదించే పరిస్థితి లేదు. కనీసం మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణిని కూడా మార్గం మధ్యలో, పోస్ట్‌ లాంచింగ్‌ దశలో కూల్చలేవు.

ఉత్తర కొరియా జాగ్రత్త తీసుకోకున్నా సగం మాత్రమే కూల్చగలవు

ఉత్తర కొరియా జాగ్రత్త తీసుకోకున్నా సగం మాత్రమే కూల్చగలవు

అమెరికా వ్యవస్థలు మొత్తం ఉత్తర కొరియా వద్ద ఉన్న హెచ్‌ఎస్ 12 శ్రేణిని లక్ష్యంగా చేసుకొని రూపుదిద్దుకున్నవి. థాడ్‌, పేట్రియాట్‌, ఏజిస్‌ వ్యవస్థలు మొత్తం స్వల్పశ్రేణి క్షిపణుల కోసం ఉద్దేశించినవి. హహ్వాసాంగ్ 14 వంటి క్షిపణిని మార్గమధ్యలో పేల్చివేయడం కష్టం. ఉ. కొరియా జామర్ల వ్యవస్థ ఎటువంటి జాగ్రత్తలు లేకుండా దీనిని ప్రయోగించినా కూల్చే అవకాశాలు సగం మాత్రమే ఉంటాయి.

అడ్డుకోవడం కష్టమే అంటున్నారు

అడ్డుకోవడం కష్టమే అంటున్నారు

నౌకల మీద అమర్చిన ఏజిస్‌ వ్యవస్థలు సరైన సమయంలో సరైన పొజిషన్‌లో లేకపోతే దూసుకొచ్చే ఖండాంతర క్షిపణిని అడ్డుకోవడం కష్టమని చెబుతున్నారు.

ఉత్తర కొరియా కుప్పలు తెప్పల క్షిపిణులను అడ్డుకోలేవని

ఉత్తర కొరియా కుప్పలు తెప్పల క్షిపిణులను అడ్డుకోలేవని

ఇక, ఉత్తర కొరియా వద్ద క్షిపణులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అదే సమయంలో దక్షిణ కొరియాలో ఏర్పాటు చేసిన థాడ్ వ్యవస్థలు పరిమితంగా ఉన్నాయి. థాడ్ బ్యాటరీలు ఎన్నో క్షిపణులను అడ్డుకోలేవని నిపుణులు చెబుతున్నారు.

యుద్ధానికి సిద్ధమన్నట్లుగా అమెరికా

యుద్ధానికి సిద్ధమన్నట్లుగా అమెరికా

ఉత్తర కొరియా సరిహద్దుల్లో అమెరికా యుద్ధ విమానాలను మోహరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు ఉత్తర కొరియా సరిహద్దులకు అతి సమీపంలో ప్రయాణించాయి. ఎటువంటి శత్రువునైనా ఓడించేందుకు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించేందుకే ఇలా చేసింది.

అమెరికా బాంబర్

అమెరికా బాంబర్

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సైనిక రహిత ప్రాంతంలో అమెరికా బాంబర్‌గా అనుమానిస్తున్న విమానం ప్రయాణించింది. ఈ శతాబ్ధంలో ఒక అమెరికా విమానం ఈ ప్రాంతంలో ప్రయాణించడం ఇదే తొలిసారి అంటున్నారు.

ఉత్తర కొరియా ఎక్కువ రోజులు ఉండదు

ఉత్తర కొరియా ఎక్కువ రోజులు ఉండదు

డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర కొరియా ఇక ఎక్కువ రోజులు ఉండదంటూ ట్వీట్ చేశారు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో ప్రసంగానికి బదులుగా ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. ఉన్మాదంతో ఊగిపోతున్న ఓ పిచ్చోడిగా ట్రంప్‌ను యాంగ్ హో అభివర్ణించారు. ఆయనతో ప్రపంచ శాంతికి ముప్పంటూ తన ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ పైన ఊగిపోయిన ఉత్తర కొరియా

ట్రంప్ పైన ఊగిపోయిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేస్తానన్న ట్రంప్ హెచ్చరికలతో ఇక మా రాకెట్లు అమెరికా ప్రధాన భూభాగంలోకి దూసుకెళ్లడం ఖాయమని కూడా యాంగ్ హెచ్చరించారు. దీనిపై ట్రంప్ ట్విట్టర్‌లో స్పందించారు. ఇప్పుడే ఆయన మాటలు విన్నానని ట్రంప్ చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను లిటిల్ రాకెట్ మ్యాన్ అంటూ అభివర్ణించారు. ఆ లిటిల్ రాకెట్ మ్యాన్ ఆలోచనలనే యాంగ్ కూడా ఐక్య రాజ్య సమితిలో వినిపించినట్లయితే ఆ దేశం ఇక ఎక్కువ రోజులు ఉండదని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+