అప్పుడు నేను అధ్యక్షుడిగా లేను కానీ: రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మోర్కెల్
ప్యారిస్: రాఫెల్ డీల్ వ్యవహారంపై ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ స్పందించారు. ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందమని, ఇరు దేశాల రక్షణ శాఖల మధ్య డల్ అని, అన్ని నిబంధనలు సవ్యంగానే ఉన్నాయని చెప్పారు. డీల్ జరిగే సమయంలో తాను అధ్యక్షుడిగా లేనని చెప్పారు.
రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందంపై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం ఐరాసలో ఉన్న మెక్రాన్ ఓ మీడియా సమావేశంలో దీనిపై మాట్లాడారు. రాఫెల్ ఒప్పందం కోసం భారత్ తరఫున భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ సంస్థను అంగీకరించాలని భారత ప్రభుత్వం ఎప్పుడైనా ఫ్రాన్సును లేదా ఫ్రాన్స్ ఏరోస్పేస్ కంపెనీ డసోను కోరిందా అని విలేకరులు అడగ్గా.. అది ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమన్నారు. అప్పుడు తాను పదవిలో లేనని చెప్పారు.
అయితే తమ ప్రభుత్వ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, ఈ కాంట్రాక్టు ఇరు దేశాల సైన్యం, రక్షణ రంగాల మధ్య సంకీర్ణ ఒప్పందమని చెప్పారు. 36 యుద్ధ విమానాల సమీకరణకు సుమారు రూ.58వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని ఫ్రాన్సుతో కుదుర్చుకున్నట్లు 2016లో భారత ప్రభుత్వం వెల్లడించింది. అప్పుడు ఫ్రాంకోయిస్ హోలాండే అధికారంలో ఉన్నారు. మెక్రాన్ గత ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications