వీడియో: మంటల్లో చిక్కుకుని కుప్పకూలిన భారీ క్రేన్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఎత్తయిన అపార్ట్‌మెంట్ మీద ఉన్న ఓ భారీ క్రేన్ కుప్పకూలింది. విరిగిన క్రేన్ శకలాలు.. నడిరోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

న్యూయార్క్ శివార్లలోని హెల్స్ కిచెన్ అనే ప్రాంతంలో ఆ దేశ కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ఘటన సంభవించింది. హెల్స్ కిచెన్‌లో రద్దీ ప్రాంతమైన 10 అవెన్యూ- వెస్ట్ 41 స్ట్రీట్‌లో గల ఓ అపార్ట్‌మెంట్ పైకప్పు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ అపార్ట్‌మెంట్‌లో కొన్ని నివాసాలతో పాటు గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో హోటల్ అండ్ రెస్టారెంట్ కొనసాగుతోంది.

Watch: A crane on a high rise building caught fire and collapsed at Hells Kitchen in New York

ఈ ఉదయం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో క్రేన్ డ్రైవర్ క్యాబిన్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అందులో నుంచి వెలువడింది. ఆ వెంటనే క్రైన్ అదుపు తప్పింది. దాని హ్యాండిల్.. మొదలుకంటా విరిగిపోయింది. కుప్పకూలింది. అది కిందికి పడే సమయంలో ఎదురుగా ఉన్న మరో భారీ భవనాన్ని కూడా ధ్వంసం చేసింది.

పెద్ద శబ్దం చేస్తూ 10 అవెన్యూ- వెస్ట్ 41 స్ట్రీట్‌ రోడ్డుపై పడింది. ఎదురుగా ఉన్న భారీ భవనాన్ని ఢీ కొట్టిన సమయంలో హ్యాండిల్ పూర్తిగా విరిగిపోయింది. దాని శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రేన్ కుప్పకూలిన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మరో భవనంపైకి ఎక్కి నీళ్లు చల్లుతూ మంటలను నియంత్రించారు. వెస్ట్ 41 స్ట్రీట్ రోడ్‌ను పోలీసులు మూసివేశారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు. వాటిని దారి మళ్లించారు. క్రేన్ శకలాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+