వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:12 ఫీట్ల పైథాన్, కూర్చొన్న చిన్నారి, టీవీ చూస్తూ.. వైరల్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా మారింది. కాలమే మారింది. ఒకప్పుడు పెంపుడు జంతువులు అంటే కుక్క లేదంటే పిల్లిలను పెంచేవారు. ఇప్పుడు పాములను కూడా సాకుతున్నారు. పాము అంటే అదేదో చిన్న పాము కాదు.. కొండ చిలువలను తమ ఇంటి వద్ద అట్టిపెట్టుకుంటున్నారు. సిటీ కల్చర్‌లో ఇదీ కామన్ అయిపోయింది. అవును పిల్లలు కూడా భయం లేకుండా ఉంటున్నారు. అలాంటి ఓ వీడియో ట్రోల్ అవుతుంది. మరీ ఎందుకు ఆలస్యం.. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

12 ఫీట్ల కొండ చిలువ

12 ఫీట్ల కొండ చిలువ

కింద ఉన్న వీడియో చూస్తే మీరు కాస్త భయపడతారు. ఎందుకంటే అందులో 12 ఫీట్ల కొండ చిలువ ఉంది. అదీ కూడా పసుపు రంగులో కనిపించింది. ఇంట్లోకి పాము వస్తేనే నానా హైరానా పడిపోతాం. మరీ అదీ ఉండగా.. దాని పైన ఓ చిన్నారి కూర్చొని ఉంది. ఏం చక్కా టీవీ చూస్తూ ఉండిపోయింది. ఆ వీడియోలో చిన్నారి కూడా ఒక్కసారి చూసి నవ్వేసింది.

నోరు తెరచిన పైథాన్

నోరు తెరచిన పైథాన్

ఆ వీడియోలో కొండ చిలువ కూడా ఒక్కసారిగా నోరు తెరిచింది. దానిని చూసిన వారు ఎవరైనా భయపడతారు. వీడియోను లాడ్ బైబిల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోను ఇప్పటికే 5 మిలియన్ సార్లు చేశారు. వీడియోలో చిన్నారి మాత్రం ఇంట్రెస్ట్‌గా టీవీ చూస్తోంది. ఏ భయం లేదు, బెరుకు లేదు. ఆ చిన్నారి చాలా సేఫ్ అని ఆమె పైరంట్స్ క్యాప్షన్ పెట్టారు. వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యూజర్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఓహ్.. నో

చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓహ్ నో అని ఒకరు రాశారు. పెంపుడు జంతువు పేరుతో ఏకంగా కొండ చిలువను పెంచుకుంటారా అని మరొకరు అడిగారు. చాలా ఆశ్చర్యం కలిగించిందని మరొకరు రాశారు. నిజమే.. కొండ చిలువతో వారు ఇలా కలిసిపోయి ఉన్నారు. అదే బయట అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. చిన్న పాము కనిపిస్తేనే భయపడిపోతాం. ఇక కొండచిలువ గురించి అయితే చెప్పక్కర్లేదు.

English summary
girl watching TV and she had a 12-foot-long python as company. video goes viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X