వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రౌండ్‌ధోగ్ ఉత్సవాలు: అమెరికా మేయర్ చెవి కొరికిన విజిల్ పిగ్(వీడియో)

|
Google Oneindia TeluguNews

విస్కిన్సన్: విస్కన్సన్‌లోని జరిగిన ఘటన ఓ మేయర్‌కి మంచి గుణపాఠమే నేర్పింది. ఈ ఘటనతో విజిల్ పిగ్ (గ్రౌండ్‌ధోగ్) అనే చిన్నపాటి జంతువులకు అతి దగ్గరగా ఉండకూదనే విషయాన్ని తెలుసుకున్నారు. సన్ ప్రెయిరీలో జరుగుతున్న గ్రౌండ్‌ధోగ్ ఉత్సవాల్లో సోమవారం మేయర్ జోనాథన్ ఫ్రాండ్స్ పాల్గొన్నారు.

కాగా, ఉత్సవంలో భాగంగా జిమ్మీ అనే విజిల్ పిగ్‌ను దగ్గరకు తీసుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో అతనికి ఒక్కసారిగా ఆ జంతువు షాకిచ్చింది. ఆ విజిల్ పిగ్ మేయర్ భుజంపైకి అతని చెవిని కొరికేసింది. దీంతో ఒక్కసారిగా మేయర్ ఉలిక్కిపడ్డారు.

వెంటనే పక్కన ఉన్న అధికారులు విజిల్ పిగ్‌ను పట్టుకొన్నారు. విజిల్ పిగ్ కొరకడంతో మేయర్ జోనాథన్‌ చెవికి స్వల్ప గాయమైంది. అయినా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Watch: Groundhog bites US mayor's ear during ceremony

కాగా, విజిల్ పిగ్ ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని అక్కడి మీడియా తెలిపింది. మేయర్‌ చెవిని కొరికిన ఘటన అనుకోకుండా జరిగిందని వెల్లడించింది. మరో నాలుగు వారాలపాటు ఇక్కడ చలి ఉంటుందని తెలిపింది. జిమ్మీ పలుకులను మేయర్ మాత్రమే అనువదించగలరని వెల్లడించింది.

English summary
A mayor in Wisconsin has learned a valuable lesson about his city's weather-predicting groundhog, don't get too close. Jimmy, the official groundhog in Sun Prairie, bit the mayor's ear during a Groundhog Day celebration on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X