ఉత్తర‘కొరివి’: పుతిన్ కు ఫోన్ చేసిన ట్రంప్.. కిమ్ జాంగ్ పైనే ఎక్కువ చర్చ

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధినేత ట్రంప్ ఫోన్ చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో వేళ్లూనుకున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే దిశగా వీరిద్దరూ చర్చించుకున్నారు. సిరియాలో ఇకపై దాడులు నిర్వహించరాదని... అక్కడి పోరును తాత్కాలికంగా ఆపివేయాలని ఇద్దరు అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే, వీరిద్దరి మధ్య ఎక్కువ చర్చ సిరియా కంటే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తీరుపైనే జరిగినట్టు తెలుస్తోంది. కిమ్ తో చర్చలకు తాను సిద్ధమంటూ ట్రంప్ ప్రకటించి గంటలు కూడా గడవక ముందే... ట్రంప్, పుతిన్ లు ఫోన్ సంప్రదింపులు జరపడం చర్చనీయాంశం అయింది.

Watch out Kim: Donald Trump and Vladimir Putin TEAM UP in plot to END North Korea conflict

అమెరికాకు భయపడే ప్రసక్తే లేదని... ఏక్షణంలో అయినా అమెరికాపై అణు దాడులు చేసేందుకు తాము సిద్ధమంటూ కిమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు జరగడం గమనార్హం.

కిమ్ కు ముకుతాడు వేయాలంటే రష్యా మద్దతు ఉండాలని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన మొండి వైఖరికి ఫుల్ స్టాప్ పెట్టి... పుతిన్ తో ట్రంప్ చర్చలు జరిపారని విశ్లేషకులు భావిస్తున్నారు.

అస్టానా, కజకిస్తాన్ లలో కాల్పుల విరమణ ఒప్పదంపై చర్చ కోసం బుధ, గురువారాల్లో అమెరికా తమ ప్రతినిధిని పంపాలని నిర్ణయించింది. అలాగే.. జీ20 దేశాల సదస్సు సందర్భంగా ఇద్దరం ముఖాముఖి కూర్చొని పలు అంశాలపై చర్చలు జరుపుదామని ట్రంప్ కు పుతిన్ ఆహ్వానం పలికినట్టు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The leaders of the US and Russia spoke on the phone this evening, according to a White House spokesperson. It marks the third time the pair have spoken since Donald Trump became president in January. They discussed North Korea, as well as the conflict in Syria. The pair also agreed to meet face-to-face for the first time when they both attend the next G20 summit.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి