Viral video : భారీ సర్పాలతో ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. అతని గట్స్‌కు నెటిజన్ల విస్మయం..
పాము... ఈ మాట వింటే చాలు చాలామంది నిద్రలో సైతం ఉలిక్కిపడుతారు. ఎక్కడైనా అది కనిపించిందంటే.. వెంటనే పరుగు అందుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఏమాత్రం అదరక,బెదరక.. అత్యంత భారీ విష సర్పాలు,కొండ చిలువల మధ్య హాయిగా కూర్చున్నాడు. అంతేనా.. అవి ఒంటి మీద నుండి పాకుతున్నా... పైనుంచి ఒక్కసారిగా పాముల కుప్ప అతని మీద పడినా తనలో కించిత్ భయం కూడా కనిపించలేదు. పైగా ముఖంలో అదే చిరునవ్వు. ఆ వీడియోని చూస్తేనే ఒంటిపై పాములు పాకినట్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉందని... అలాంటిది ఆ వ్యక్తి అంత తాపీగా ఎలా కూర్చోగలిగాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు జే బ్రూవర్... 12 సెకన్ల నిడివి గల ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.24 గంటల్లో 3లక్షల మంది పైగా దీనిని వీక్షించారు. 50 మిలియన్ డాలర్లు ఇస్తా... ఒక గంట పాటు ఇలా సర్పాల మధ్యలో ఉండగలరా? అని ప్రశ్నిస్తూ ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మరికొందరేమో అవి విష రహిత సర్పాలు అయి ఉండొచ్చు.. అందుకే అంత ప్రశాంతంగా అలా పాముల మధ్య కూర్చొన్నాడని అంటున్నారు. ఎంతైనా అంత భారీ సర్పాల మధ్య భయం లేకుండా కూర్చొన్నాడంటే అతని గట్స్‌కు మెచ్చుకోవాల్సిందేనని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
CAN YOU SPEND 1 HOUR INSIDE HERE FOR 50 MILLION DOLLARS??? pic.twitter.com/WP8Rt4rT6W
— Aqualady𓃤 𓅇 𓅋 𓆘 (@Aqualady6666) February 3, 2021












Click it and Unblock the Notifications