ఏకే47 పేల్చిన చిన్నారి: భారత్, మోడీకి వార్నింగ్(వీడియో)
ఇస్లామాబాద్: మనదేశంలోని యూరీ ప్రాంతంలో ఉగ్రదాడికి పాల్పడి 20మంది సైనికుల ప్రాణాలు తీసిన పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వలాలు పెల్లుబుకుతున్నాయి. కాగా, పాకిస్థాన్ ఓ వైపు దాడులకు పాల్పడుతూనే మనదేశంపైనే మండిపడిపోతోంది. అంతేగాక, ఆ దేశంలోని ప్రజల్లో కూడా ధ్వేష భావాన్ని కలిగిస్తోంది. ఇందుకు తాజాగా, వెలువడిన ఓ వీడియోనే సాక్ష్యంగా నిలుస్తోంది.
పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారికి ఏకే 47 గన్ అప్పగించి.. భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోడీకి హెచ్చరికలు జారి చేసినట్లుగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఆ చిన్నారి తండ్రి.

ఈ వీడియోలో ఓ చిన్నారి తన తండ్రి పక్కనే కూర్చుని ఏకే 47 గన్ పట్టుకుని భారత్‌ను హెచ్చరించినట్లుగా వ్యాఖ్యలు చేసింది. అంతేగాక, వార్నింగ్ ఇస్తున్నట్లు ఏకే 47తో కాల్పులు జరిపింది. గన్ ఎలా పేల్చాలో కూడా ఆ పాపకు తండ్రే నేర్పించడం గమనార్హం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పాకిస్థానీయులు మాత్రం మద్దతుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, పాక్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దీంతో పాకిస్థాన్ ఏకాకిగా మారిపోయింది. ఏదైనా మాట్లాడితో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లు తెలిసిపోతుందని దాడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు పాకిస్థాన్. అంతేగాక, భారతే.. పాకిస్థాన్ లో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది కూడా.
When jingoism trickles down to the kids. The despicable dad lets a child fire AK-47 as she threatens Modi & Indiapic.twitter.com/vPQGFq1mhJ
— Mohammad Taqi (@mazdaki) 23 September 2016
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications