విచిత్రం: కళ్లెదురుగానే కుప్పకూలిన విమానం.. ఎవరికీ ఏం కాలేదు (వీడియో)

ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వాహనాలు ఆగున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఓ విమానం కిందకి దూసుకొస్తూ కరెంటు తీగలను రాసుకుంటూ నిప్పుల ముద్దలా వచ్చి కుప్పకూలిపోయింది.

వాషింగ్టన్: రోడ్డు మీద వెళుతున్నప్పుడు చిన్న ప్రమాదానికే మనం కంగారుపడిపోతాం. అలాంటిది ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ విమానం అమాంతం కిందకి వచ్చి.. మన కళ్లముందే పేలిపోతే? అప్పుడెలా ఉంటుంది?

ఇదేదో ఊహ కాదు. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. అది వాషింగ్టన్ అక్కడి ముకిల్‌టియో ప్రాంతం. అప్పుడు సమయం సాయంత్రం మూడున్నర గంటలు.

ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వాహనాలు ఆగున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఓ విమానం కిందకి దూసుకొస్తూ కరెంటు తీగలను రాసుకుంటూ నిప్పుల ముద్దలా వచ్చి కుప్పకూలిపోయింది. అది చూసి ఒక్క క్షణం పాటు వాహనదారులందరికీ గుండె ఆగినంత పనైంది.

విచిత్రమేంటంటే.. మామూలుగా రన్‌వే మీద విమానాలు జారిపడినా ప్రయాణికులకు స్వల్పంగానైనా గాయాలవుతుంటాయి. అలాంటిది.. ఈ ఘటనలో మాత్రం ఎవరికీ ఏమీ కాలేదు.

విమానం నిప్పులు చిమ్ముతూ నేలపై కూలినా అందులోని ప్రయాణికులకు, చివరికి పైలట్‌కు కూడా చిన్న దెబ్బ తగలకపోవడం విచిత్రమే కాదు, అదృష్టం కూడా. అయితే విమానం కూలిపోతున్న సమయంలో దగ్గర్లోని ఓ కారుకి తగిలింది. ఆ సమయంలో ఓ మహిళ కూడా కారులో ఉంది. అయినా ఆ మహిళకీ కూడా ఏమీ కాలేదు. ఇదీ విచిత్రమంటే! కావాలంటే వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+