ఏడాది బుడ్డోడు ఇంటిపై నుంచి దూకేశాడు(వీడియో)
మిడిల్ఈస్ట్: ఏ తల్లిదండ్రులైనా ఏడాది చిన్నారిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తమ చేతుల నుంచి ఎగేరేసి పట్టుకోవడానికి ఎంతో జాగ్రత్త పడతారు. అయితే, దాదాపు 10 అడుగుల ఎత్తు ఉన్న డాబా ఇంటిపై నుంచి ఏడాది బాలుడ్ని దూకమన్నాడు అతని తండ్రి. ఆ బుడ్డోడికి ఏం తెలుసు తండ్రి చెప్పాడు కదాని దూకేశాడు.
కాగా, తండ్రి అతడ్ని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మిడిల్ ఈస్ట్‌లో జరిగిన ఈ ఘటన భయపెట్టేదిగా ఉంది. ప్రస్తుత వైరల్‌గా మారిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.తండ్రి అంత నిర్లక్ష్యంగా పిల్లాడి ప్రాణాల్ని పణంగా పెట్టి.. ఈ దారుణమైన సాహసాన్ని చేయాల్సిన అవసరమేముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోలో వెనుక ఉన్న ఓ మహిళ నవ్వుతున్నట్టు వినిపిస్తోంది. ఆన్‌లైన్‌లో పెట్టే ఉద్దేశంతో తీసినా.. లేక మరే ఉద్దేశంతో ఈ వీడియో తీసినా.. ఆచిన్నారి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడంపై మాత్రం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఆ బుజ్జాయి డాబాపైకి ఎక్కి.. కిందకు దూకేస్తే ఎవరిది బాధ్యత? అని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల పట్ల ఇలాంటి ప్రమాదకర ఫీట్లు తగదని హితవు పలుకుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications