అద్భుతం.. మెషిన్ కన్నా వేగంగా.. డబ్బులు లెక్కపెడుతున్న క్యాషియర్! (వీడియో)

చైనాలో ఓ ప్రైవేటు బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి డబ్బులను కౌంటింగ్‌ మెషిన్‌ కన్నా వేగంగా లెక్కపెడుతోంది. ఆ మహిళా ఉద్యోగిని ముద్దుగా తోటి ఉద్యోగులు కౌంటింగ్‌ మెషిన్‌ అని పిలుచుక

బీజింగ్: సాధారణంగా నోట్లను లెక్కించే యంత్రాలు మనకు బ్యాంకుల్లో కనిపిస్తుంటాయి. డబ్బుల కట్టను ఆ మెషిన్ లో పెట్టీ పెట్టగానే సర్ర్..మంటూ మొదలవుతుంది లెక్క. ఇందులో పెద్ద విషయం ఏముందీ అంటారా?

కానీ అద్భుతమైన విషయం ఏమిటంటే.. మెషిన్ కన్నా వేగంగా మనిషే డబ్బును లెక్కబెట్టడం. చైనాలో ఓ ప్రైవేటు బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి డబ్బులను కౌంటింగ్‌ మెషిన్‌ కన్నా వేగంగా లెక్కపెడుతోంది.

currency

షాంగ్‌డాంగ్‌కు చెందిన ఈ యువతి చైనా కరెన్సీ(యువాన్‌)లో 550 నోట్లను సెకన్లలోనే లెక్కపెడుతుందని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఆ మహిళా ఉద్యోగిని ముద్దుగా తోటి ఉద్యోగులు కౌంటింగ్‌ మెషిన్‌ అని పిలుచుకుంటారట.

ఆ బ్యాంకుకు వచ్చే వినియోగదారులు కూడా త్వరగా తమ పని ముగించుకునేందుకు సదరు క్యాషియర్ వద్దకే వెళుతుంటారట. ఆ మహిళా ఉద్యోగి నోట్లను లెక్కపెడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. మీరూ చూడండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+