విమానంలో వర్షం, ప్రయాణీకులంతా తడిసిపోయారు
అమెరికాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ఎయిర్ లైన్స్ డెల్టా విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విమానం అట్లాంటా నుంచి ఫ్లోరిడా వెళుతుండగా వారిపై వర్షపు చినుకులు పడ్డాయి.
వాషింగ్టన్: అమెరికాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ఎయిర్ లైన్స్ డెల్టా విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విమానం అట్లాంటా నుంచి ఫ్లోరిడా వెళుతుండగా వారిపై వర్షపు చినుకులు పడ్డాయి.
సమయానికి వారి వద్ద గొడుగులు కూడా లేకపోవడంతో ఈ విమానంలోని ప్రయాణికులు అలా తడుస్తూనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మెక్‌కాల్ఫ్ తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ... తనకు షవర్ కింద ఉన్న అనుభూతి కలిగిందన్నాడు. దీనిని అతని కుమారుడు కూడా షేర్ చేస్తూ ప్రయాణికులంతా తడుస్తూనే ప్రయాణం చేస్తున్నారని కామెంట్ పెట్టాడు. కాగా విషయం తెలుసుకున్న డెల్టా సిబ్బంది... మెక్‌కాల్ఫ్‌కు పరిహారంగా 100 డాలర్ల ఓచర్‌ను అందించింది.












Click it and Unblock the Notifications