మమ్మల్ని క్షమించండి..! నరమేధం పై న్యూజీలాండ్ వాసుల వేడుకోలు..!!
క్రైష్టు చర్చ్/ హైదరాబాద్ : అత్యంత శాంతియుతమైన దేశాల్లో రెండో స్థానంలో ఉండి, ప్రశాంతతకు మారు పేరైన దీవుల సముదాయం న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లోకి దుండగులు చొరబడి ప్రార్థనల్లో ఉన్న వారిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోలను ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ చేస్తూ భీతిగొల్పేలా ప్రవర్తించారు. ఈ దుర్ఘటనలో 49 మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ దేశంలో జాత్యహంకారి జరిపిన నరమేధం పట్ల న్యూజిలాండ్ వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలపై జరిగిన ఈ దాడి హేయమైనదని ఖండిస్తున్నారు. ఇక ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. 'న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో చీకటి రోజు' అని ఉద్వేగానికి గురయ్యారు.
మసీదులో ఉన్మాది కాల్పులపై ఆ దేశం క్షమాపణలు కోరింది. స్నేహ సౌబ్రాత్రుత్వాలతో విరాజిల్లే న్యూజీలాండ్ దేశంలో ఇలాంటి ఘాతుకం జరగడం శోచనీయమన్నారు. మీరు ధైర్యంగా ఇక్కడ ఉండండి. మమ్మల్ని క్షమించండి. నిజానికి మేము అలాంటి వాళ్లం కాదు. అటువంటి సంకుచిత మనస్తత్వం గల వ్యక్తులు ఎప్పటికీ గెలవలేరు. ప్రేమను ఎంచుకోండి. ప్రశాంతంగా జీవించండి' అంటూ న్యూజిలాండ్ వాసులు క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

తమ దేశంలో ముస్లిం సోదరుల పట్ల జరిగిన అమానుష చర్యకు క్షమాపణలు చెబుతున్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా సరే తమను సంప్రదించాలంటూ బొటానికల్ గార్డెన్‌లో.. పెద్దలు ఫోన్ నంబర్లు షేరు చేస్తుండగా.. పిల్లలు తమ బొమ్మలు, పువ్వులు, గ్రీటింగ్ కార్డులు అక్కడ ఉంచి శాంతి సందేశం అందిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications