వైట్ హౌస్ కు వచ్చీ పోయే వాళ్లందరితో ట్రంప్ అదే మాట- తల పట్టుకుంటోన్న భారత్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. రెండు దేశాలు దాడులు ప్రతిదాడులకు దిగాయి. డ్రోన్లు, మిస్సైళ్లను సంధించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి.
భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని తాను హెచ్చరించానని, దీనితో ఈ రెండు దేశాలు కూడా యుద్ధ విరమణ ప్రకటించాయని ఆయన చెప్పుకొన్నారు.

మొన్నటికి మొన్న ఆయన సౌదీ అరేబియా పర్యటనలో కూడా ఇదే మాటను ప్రస్తావించారాయన. సౌదీ- యూఎస్ ఇన్వెస్టిమెంట్ ఫోరం సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ భారత్- పాకిస్థాన్ యుద్ధం, పరస్పర దాడుల గురించి వివరించారు. యుద్ధం కంటే చర్చలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనీ చెప్పుకొచ్చారు. యుద్ధ నివారణ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
భారత్- పాకిస్తాన్ యుద్ధానికి తానే అడ్డుకట్ట వేశానని డొనాల్డ్ ట్రంప్ పురుద్ఘాటించారు అప్పట్లో. దీనితో గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టయింది. ఈ వ్యాఖ్యలకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ దీన్ని ఆయన పెద్దగా పరిగణనలోకి తీసుకోనట్టుగానే కనిపించారు.
ఇప్పుడు తాజాగా మరోసారి ఇదే అంశాన్ని లేవనెత్తారు డొనాల్డ్ ట్రంప్. భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా తాను చర్యలు తీసుకున్నానని, ఇది చారిత్రాత్మక ఘట్టమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కుదుర్చుకోవడానికి వాణిజ్యాన్ని ఉపయోగించానని, దీనితో తన అభిప్రాయాలను అంగీకరించారని, ఏకీభవించారని ట్రంప్ వివరించారు.
అమెరికా పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫొసాతో వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో సమావేశం అయ్యారు ట్రంప్. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, వాణిజ్య, ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు.
పనిలో పనిగా భారత్- పాక్ యుద్ధాన్ని కూడా లేవనెత్తారు డొనాల్డ్ ట్రంప్. రెండు అణ్వస్త్ర దేశాలు భారత్- పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని రూపుమాపేలా, యుద్ధాన్ని ఆపేలా తాను క్రియాశీలక పాత్ర పోషించానని అన్నారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి తన వ్యక్తిగత దౌత్యం, వాణిజ్య ఒప్పందాలను ప్రయోగించినట్లు తెలిపారు.
"భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధాన్ని నివారించడానికి తాను ఏం చేశానో ఒకసారి పరిశీలించాలని సిరిల్ రమాఫొసాకు విజ్ఞప్తి చేశారు ట్రంప్. ఇ వ్యవహారం మొత్తాన్నీ పరిష్కరించుకున్నామని వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాలు, కార్యకలాపాల ద్వారా పరిష్కరించుకున్నానని అన్నారు. త్వరలోనే- భారత్, పాకిస్తాన్‌తో ఓ భారీ ఒప్పందం చేసుకుంటోన్నామని ట్రంప్ చెప్పారు.
పరస్పూరం యుద్ధానికి దిగడం, కాల్పులు జరుపుకోవడం అనేది.. చిట్టచివరి ప్రయత్నం మాత్రమే కావాలని తాము ముందు నుంచీ కోరుకుంటోన్నామని, ఇదే విషయాన్ని ఇతర దేశాలకూ తెలియజేశానని ట్రంప్ చెప్పారు. యుద్ధానికి దిగితే ఆ సమస్య మరింత జటిలమౌతుందని అన్నారు. అందుకే- యుద్ధాన్ని నివారించడానికి తాను భారత్- పాకిస్తాన్ తో మాట్లాడానని పేర్కొన్నారు.
#WATCH | US President Donald Trump says, "If you take a look at what we just did with Pakistan and India, we settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan...Somebody had to be the last one… pic.twitter.com/oaM6nCJCLi
— ANI (@ANI) May 21, 2025
రెండు దేశాలను ట్రంప్ ప్రశంసించారు. పాకిస్తాన్‌లో కొంతమంది అద్భుతమైన వ్యక్తులు, గొప్ప నాయకుడు ఉన్నారని చెప్పారు ట్రంప్. భారత్, ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఓ గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఈ రెండు దేశాల నాయకులను కూర్చోబెట్టి వారితో మాట్లాడానని, యుద్ధాన్ని నివారించానని అన్నారు.












Click it and Unblock the Notifications