ఉక్రెయిన్‌ను వీడేది లేదు.. లక్ష్యం సాధించేవరకు సైనిక చర్యలు : రష్యా కీల‌క వ్యాఖ్య‌లు

ఉక్రెయిన్‌పై రష్యా వెనక్కి తగ్గేలా కన్పించడంలేదు. తన దూకుడును మరింత పెంచింది. దాడులను ఉధృతం చేసింది. బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా... రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మిస్సైల్స్‌తో ఉక్రెయిన్ కీలక నగరాలపై ర‌ష్యా సైన్యం దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున్నప్రాణ నష్టం జరుగుతోంది.

 ఉక్రెయిన్‌లో భీక‌ర‌యుద్ధం

ఉక్రెయిన్‌లో భీక‌ర‌యుద్ధం

ఉక్రెయిన్ రాజధాని కీవ్ చుట్టూ ర‌ష్యా త‌న బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. దాదాపు 40 మైళ్ల దూరం వ‌ర‌కు త‌న మిల‌ట‌రీ కాన్వాయ్ ఉంది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు కూడా తాజాగా విడుద‌ల‌య్యాయి.
ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాల‌తో కూడిన బ‌ల‌గాల‌ను మోహ‌రించ‌డం భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. కీల‌క న‌గరాలు, ప్ర‌భుత్వ కార్యాల‌యే ల‌క్ష్యంగా బాంబుల‌తో దాడుల‌కు దిగుతోంది. దీంతో ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. పొరుగు దేశాల‌కు ప‌రుగులు తీస్తున్నారు.

 లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్‌లో సైనికులు

లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్‌లో సైనికులు


తమ లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్‌ను వీడేది లేదని ర‌ష్యా తెగేసి చెబుతుంది. ఉక్రెయిన్‌లో సైనిక చ‌ర్య‌లు కొన‌సాగిస్తామ‌ని ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ మంత్రి సెర్గీ పోయిగు తెలిపారు. తాము ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్ర‌మించుకోవ‌డం లేద‌ని అన్నారు. ప‌శ్చిమ దేశాల ముప్పు నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డ‌మే త‌మ ప్ర‌ధాన లక్ష్య‌మ‌ని పేర్కొన్నారు. యూర‌ప్ నుంచి అణ్వాయుధాల‌ను తొల‌గించాల‌ని ర‌ష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్టీ లావ్రోవ్ అమెరికాను డిమాండ్ చేశారు.

 ఖార్కివ్‌లో ర‌ష్యా దాడులు.. భార‌త విద్యార్థి మృతి

ఖార్కివ్‌లో ర‌ష్యా దాడులు.. భార‌త విద్యార్థి మృతి

ఖార్కివ్‌లో ర‌ష్యా జ‌రిపిన దాడుల్లో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో భార‌త్‌కు చెందిన వైద్య విద్యార్థి కూడా ఉన్నారు. ఈవిష‌యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి అరీంద‌మ్ బాగ్చీ వెల్ల‌డించారు. మృతి చెందిన విద్యార్థి క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి జిల్లాకు చెందిన న‌వీన్ గా గుర్తించారు. న‌వీన్ కుటుంబానికి విదేశాంగ శాఖ ప్ర‌గా సానుభూతి ప్ర‌క‌టించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ర‌ష్యా-ఉక్రెయిన్ రాయ‌బారుల‌తో భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ శ్రింగ్లా మాట్లాడారు. భార‌తీయుల ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+