‘మేం లొంగేది లేదు.. పాకిస్తాన్‌ను బెదిరిస్తే.. తాలిబాన్‌ను దారిలో పెట్టొచ్చు’ - అఫ్గాన్ మాజీ ప్రధాని అమ్రుల్లా సాలేహ్

అమ్రుల్లా సాలేహ్

లొంగుబాటుకు సంబంధించిన ఒప్పందానికి తావే లేదని అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి అమ్రుల్లా సాలేహ్ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన జర్మన్ దినపత్రిక డెర్ స్పీజెల్‌కు ఒక కథనాన్ని రాశారు.

తాలిబాన్‌ పాలనను తాను గుర్తించబోనని, అలాగే లొంగిపోయే ప్రణాళికలేవీ లేవని చెప్పారు.

ఆగస్టు 15వ తేదీన తాలిబాన్లు రాజధాని కాబుల్ నగరాన్ని చేజిక్కించుకుని, దేశంలో తమ పాలన మొదలైందని ప్రకటించుకున్నారు.

అదే రోజు దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయారు. దీంతో దేశానికి తానే నాయకుడినని సాలేహ్ ప్రకటించారు.

ప్రస్తుతం పంజ్‌షీర్ లోయలో ఉన్నట్లు, తాలిబాన్లపై పోరాడుతున్నట్లు సాలేహ్ చెబుతున్నారు.

''భౌగోళికంగా మేం ఏకాకులం అయినప్పటికీ.. రాజకీయంగా, నైతికంగా అఫ్గానిస్తాన్ మాతోనే ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

తాలిబాన్‌కు రాజకీయ పరిష్కారంపై ఎన్నడూ నమ్మకం లేదని ఆయన వెల్లడించారు.

ట్రంప్, బైడెన్ ఇద్దరి నాయకత్వాల్లోనూ అమెరికా ప్రభుత్వ అమాయకత్వాన్ని, అలసటను, దూరదృష్టితో చూడలేనితనాన్ని తాలిబాన్లు బాగా వాడుకుని అఫ్గాన్‌ను చేజిక్కించుకున్నారని వివరించారు.

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఒక పరిష్కారం ఉందని.. ''నిర్దిష్టమైన ఆంక్షలు విధిస్తామని పాకిస్తాన్‌‌ను బెదిరించి, రాజకీయ పరిష్కారానికి డిమాండ్ చేయడం, పంజ్‌షీర్‌లోని జాతీయ ప్రతిఘటనను గుర్తించి, రాజకీయ మద్దతు ఇవ్వడం’’ ద్వారా తాలిబాన్‌ వ్యవహారం పరిష్కారం అవుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+