Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శృంగారం పై కరోనా కాటు.. సెక్స్‌లో ఇవి తప్పనిసరి..ముద్దు పెట్టారో మటాషే..!

కెనడా: అసలే కరోనా వైరస్.. ఏం చేయాలన్న ఏదో తెలియని భయం ఆవహిస్తోంది. చివరకు శృంగార సమయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీంతో శృంగారం అంటేనే కొందరికి భయం పుడుతోంది. అయితే శృంగారం సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదని కెనడాలోని ఓ టాప్ డాక్టర్ వెల్లడించారు. శృంగార సమయంలో ఏ కాస్త ఉదాసీనతతో వ్యవహరించినా కరోనా కాటేసేందుకు సిద్ధంగా ఉందని ఆమె హెచ్చిరించారు.

 సెక్స్ లైఫ్‌లో జాగ్రత్త తీసుకోకుంటే ప్రమాదమే..

సెక్స్ లైఫ్‌లో జాగ్రత్త తీసుకోకుంటే ప్రమాదమే..

శృంగారం అంటే ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. అయితే ఒకప్పుడు శృంగారానికి హద్దులు లేవు. కానీ కరోనా జీవితంలో ఒక భాగమైన తర్వాత అన్నిటితో పాటు శృంగారంపై కూడా కొన్ని పరిమితులను తీసుకొచ్చింది. అయితే ఆ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. లేదంటే కరోనా బారిన పడక తప్పదని కెనడా చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ థెరెసా టామ్ చెబుతున్నారు. ఈ మేరకు ఆమె ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఎవరైతే శృంగారంలో పాల్గొంటున్నారో వారు తప్పని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ఆమె సూచిస్తున్నారు. సాధారణంగా సేఫ్ సెక్స్ కోసం కండోమ్‌లు వాడుతున్నారు. అయితే ఇప్పుడు కరోనా భయం ఉండటంతో తప్పకుండా మాస్కులు ధరించాల్సిందేనని డాక్టర్ టామ్ చెబుతున్నారు.

ఈ సమయంలో ముద్దు యమ డేంజర్

ఈ సమయంలో ముద్దు యమ డేంజర్

శృంగారంలో ఎంతో కీలక అంశం ముద్దు. అలాంటి ముద్దుకు చెక్ పెట్టాలని చెబుతున్నారు డాక్టర్ టామ్. ఇప్పుడు ముద్దు కోసం కక్కుర్తి పడితే ముద్ద దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ టామ్. ఇంట్లోని వారు బయటకు వెళ్లినప్పుడు రకరకాల వారిని కలిసి తిరిగి ఇంటికి వస్తుంటారు. అలాంటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ఇక శృంగార సమయంలో ఇద్దరూ దగ్గరవుతారు కాబట్టి వ్యాధి మరింత వేగంగా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరి ముఖం ఒకరు దగ్గరగా ఉంచకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. అంతేకాదు పార్ట్‌నర్స్ ఇద్దరూ నోరు మరియు ముక్కు కవర్ అయ్యేలా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

మద్యం పై నియంత్రణ ఉండాలి లేకుంటే...

మద్యం పై నియంత్రణ ఉండాలి లేకుంటే...

ప్రస్తుతం ఉన్న పరిశోధనల ఆధారంగా చూస్తే... మగవారి వీర్యం లేదా ఆడవారి వజైనల్ ఫ్లూయిడ్స్ నుంచి కరోనా వచ్చిన దాఖలాలు చాలా తక్కువని చెబుతున్నారు. ఒక వేళ ఇలా జరిగినా కూడా లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. అయితే కొత్త వారితో లైంగికంగా కలిసేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ ముద్దు పెట్టినా కరోనా సోకే ప్రమాదం చాలా ఉందని చెబుతున్నారు. అంతేకాదు ఒక వ్యక్తిలో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే తప్పకుండా సెక్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మద్యం సేవిస్తే కంట్రోల్ ఉండదని దీంతో శృంగారం దిశగా అడుగులు వేసి ప్రమాదం కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి... వేసే పెగ్గులపై కాస్త నియంత్రణ ఉండేలా చూసుకోవాలని డాక్టర్ టామ్ చెబుతున్నారు. ఇక శృంగారం తప్పదనుకుంటే కండోమ్‌లు కూడా వినియోగించడం సురక్షితమైన ప్రాక్టీస్ అవుతుందని చెబుతున్నారు.

మొత్తానికి పై జాగ్రత్తలు తీసుకుంటే అటు ఆరోగ్యకరమైన శృంగారంను ఎంజాయ్ చేయడంతో పాటు కరోనా బారిన పడకుండా ఉండే అవకాశం ఉందని డాక్టర్ టామ్ చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చేసిన కృషి కూడా వృథా కాదని ఆమె తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+