అగ్నిపర్వతం పేలితే ఎట్టా ఉంటాదో తెలుసా?

హొనొలులు: హవాయ్‌లోని రెండో అతి పెద్ద అగ్నిపర్వతం కిలౌయా.. ఒక్కసారిగా బద్దలైంది. లావా ఎగజిమ్మింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన అగ్నిపర్వత పేలుడు ఘటనల్లో ఇదే అతిపెద్దదిగా భావిస్తోన్నారు. ఈ అగ్నిపర్వతం నుంచి లావా ఎగదన్నడాన్ని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్)కు చెందిన వెబ్ కామ్ రికార్డ్ చేసింది.

హవాయ్ స్టాండర్డ్ టైమ్ జోన్ ప్రకారం- బుధవారం తెల్లవారు జామున సరిగ్గా 4:44 నిమిషాలకు కిలౌయా అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం విస్ఫోటనం తరువాత వెలువడిన లావా ప్రస్తుతానికి పరిమితంగానే ఉందని, ప్రజలకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ముప్పు వాటిల్ల లేదని అమెరికన్ జియొలాజికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. దీని తీవ్రత అధికంగా ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నామని పేర్కొన్నారు.

 lava flows

అగ్నిపర్వతం విస్ఫోటనం తరువాత యూఎస్‌జీఎస్ అధికారులు ప్రమాద తీవ్రతను తెలియజేస్తూ రెడ్ వార్నింగ్ మెసేజీని హవాయ్ అధికార యంత్రాంగానికి పంపించింది. అగ్నిపర్వతం పేలుడుకు ముందు ఆరెంజ్ మెసేజీని జారీ చేసింది యూఎస్‌జీఎస్. పేలుడు తరువాత తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో ఉండటం వల్ల దీన్ని రెడ్ వార్నింగ్‌ మెసేజీగా బదలాయించింది.

అగ్నిపర్వత పేలుడు ప్రారంభ దశను డైనమిక్గా అభివర్ణించింది యూఎస్‌జీఎస్. ప్రధాన పేలుడు తరువాత కూడా అదే స్థాయిలో విస్ఫోటనాలు సంభవించాయి. బ్రేక్ లేకుండా లావా వెదజల్లడం వెబ్ కామ్‌లో రికార్డయింది. లావా వేగాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తామని యూఎస్‌జీఎస్ పేర్కొంది. అగ్నిపర్వతం నుంచి వెదజల్లిన లావా హలేమౌమౌ క్రీక్ వద్ద ఓ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించినట్లు తెలిపింది.

 lava flows

ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉండే అగ్నిపర్వతాల్లో ఒకటి.. కిలౌయా. 2018లో పేలిన ఈ అగ్నిపర్వతం అప్పట్లో విలయాన్ని సృష్టించింది. కిలౌయా విస్ఫోటనం వల్ల 700లకు పైగా నివాసాలు ధ్వంసం అయ్యాయి. బూడిదతో మునిగిపోయాయి. తాజాగా ఈ ఏడాది జనవరిలో ఇది పేలినప్పటికీ తీవ్రత ఆ స్థాయిలో లేదు. ఆరు నెలల వ్యవధిలో మళ్లీ ఈ వోల్కనో విస్ఫోటనం చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+