వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెబ్‌క్యామ్ ట్రాన్స్‌లేటర్లు: అశ్లీల చాటింగ్‌ల వెనుక రహస్య సంధానకర్తలు.. ‘మీతో మాట్లాడేది మోడలా? మూడో మనిషా?’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
web cam model

'మేం వారితో చాటింగ్ మాత్రమే చేస్తాం. కానీ, కొందరు క్లయింట్లు మాత్రం ఏదోరకంగా 'రోల్ ప్లేయింగ్' చేయించే ప్రయత్నం చేస్తుంటారు. ''ఈ రోజు నీకోసం నేను చాలా మంచి డ్రెస్ వేసుకున్నాను. నా భుజంపై చేయి వేయి.. ఇంకా ముందుకు పోదాం'' అంటుంటారు'.

వెబ్‌క్యామ్ గర్ల్‌గా పనిచేసే సోఫియా చెప్పిన మాటలు ఇవి.

పోర్న్ ప్రపంచాన్ని 'వెబ్‌క్యామ్ గర్ల్స్' పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ రంగం ఎక్కువగా మహిళల చుట్టూ అల్లుకుని ఉంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో వెబ్‌క్యామ్ చాటింగ్‌లను 'మీరైనా, నేనైనా.. ఎవరైనా సరే క్షణాల్లో ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తారు' అంటారు కొందరు.

క్యామ్ గర్ల్ ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన జెనియా, సోఫియాలు.. అక్కడ ఏం చేస్తారు.. క్లయింట్లు ఎలా ఉంటారు? మోడల్స్, ట్రాన్స్‌లేటర్లు ఎంత సంపాదిస్తారు వంటి వివరాలన్నీ 'బీబీసీ'తో చెప్పారు.

sofia

'సాధారణంగా ‌క్యామ్ రూమ్‌లోకి అమ్మాయిలే ముందు వస్తారు. ఆ వెంటనే తలుపులు మూసుకుపోతాయి. ఆమె సిద్ధమవుతుంది. ఆ తరువాత ఆమె పనిలో దిగడానికి ముందు సిగరెట్ తాగడానికి బయటకు వెళ్తుంది. ఆమె పూర్తిగా ఒక వేరే మనిషిలా భావిస్తుంది.. ఆమె పట్ల అటెన్షన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆమెను కోరుకుంటారు. ఆమెకు డబ్బులు లభిస్తాయి'' అంటూ ఈ వ్యవహారమంతా ఎలా నడుస్తుందో చెప్పుకొచ్చారు జెనియా.

'కొన్నాళ్ల కిందట మాస్కోలో నా ఫ్లాట్‌మేట్ కోస్త్యా నుంచి నేను ఈ వెబ్ క్యామ్ ట్రాన్స్‌లేటర్ల గురించి, వెబ్‌క్యామ్ గర్ల్స్ స్టుడియోల గురించి తొలిసారి విన్నాను.

వెబ్‌క్యామ్ పెర్ఫార్మర్లు, క్లయింట్ల మధ్య వీరు రహస్య మాధ్యమంగా పనిచేస్తారు. వెబ్‌క్యామ్ పెర్ఫార్మర్, క్లయింట్ మధ్య కంటికి కనిపించని మూడో మనిషిలా ఉంటారు వీరు.

నోవోసిబిరిస్క్‌లో వీరిని కలవడానికి వెళ్లాను నేను' అన్నారు జెనియా.

xenia

జెనియా 2008-2009 ప్రాంతంలో వెబ్‌క్యామ్ ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు. సోఫియా ఇప్పటికీ ఇదే పని చేస్తున్నారు.

నోవోసిబిరిస్క్‌ను స్టూడెంట్ సిటీగా చెబుతారు. ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా నివసిస్తుంటారు. యూనివర్సిటీ చదువుల కోసం వచ్చి నాలుగైదేళ్లు ఇక్కడ ఉంటారు. ఆ తరువాత వెళ్లిపోతారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే యువతకు ఇది తాత్కాలిక నివాస ప్రాంతం అనుకోవచ్చు. ఈ నగరంలో పెద్ద సంఖ్యలో యువత ఉంటారు.

వీళ్లలో చాలామంది నిత్యం ఏదో ఒక కొత్తదనం కోరుకుంటుంటారు.

కర్టెన్లతో ఉండే కోచ్‌లు

వెబ్ కెమెరా సెటప్ ఎలా ఉంటుందంటే..

ఒక చిన్న కోచ్‌లో మోడల్ కూర్చుంటారు. కెమెరా చుట్టూ తిప్పి చూసినా కర్టెన్లు వేసి కనిపిస్తాయి. ఆ కర్టెన్ల వెనుక ఇలాంటి చిన్న కోచ్‌లలో వేరే మోడల్స్ ఉంటారు. ట్రాన్స్‌లేటర్లు, స్టుడియో సిబ్బంది కూడా ఈ చిన్నచిన్న కోచ్‌ల నుంచే పనిచేస్తారు.

మోడల్స్‌లో చాలామంది ఇంగ్లిష్‌లో చిన్నచిన్న మాటలు కూడా రాయలేరు. 'హౌ ఆర్ యూ' అనేది కూడా ఇంగ్లిష్‌లో రాయడం రానివారు ఉంటారు వీరిలో.

మోడల్ ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేయలేదు కాబట్టి ఆమె తరఫున క్లయింట్‌తో వెబ్‌క్యామ్ ట్రాన్స్‌లేటర్ కమ్యూనికేట్ చేస్తారు.

క్లయింట్ కోరుకున్న పనిని ఇక్కడి మోడల్స్ చేస్తారు.

'మోడల్‌కు సపోర్ట్ ఇస్తుంటాం'

జెనియా ఓసారి తనకు ఎదురైన అనుభవం గురించి వివరించారు.

''ఒక క్లయింట్ గురించి మీకు చెప్పాలి. ఆయన దట్టమైన, పొడవాటి జుత్తుతో ఉన్నాడు. కెమెరాలో ఉన్నంత సేపు ఆయన తన జుత్తు చూపిస్తూనే ఉన్నాడు. తన పోనీ టెయిల్ విప్పేస్తున్నాడు. అప్పుడు మోడల్‌తో నేను 'ఆయన ఎంత అందంగా ఉన్నాడో ఎక్స్‌ప్రెస్ చేయమన్నాను'' అని జెనియా చెప్పుకొచ్చారు.

'క్లయింట్లతో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకుంటే ఈ రంగంలో మంచి డబ్బులు వస్తాయి’’ అన్నారామె.

క్లయింట్లు డైవోర్సీలు కావొచ్చు.. జీవిత భాగస్వాములను కోల్పోయినవారు కావొచ్చు. అందుకే వారు మోడల్స్ దగ్గరకు వస్తారు. వీరిని ఒక సైకాలజిస్ట్‌లా భావిస్తారని జెనియా చెప్పారు.

నిజానికి ఇక్కడ వెబ్‌క్యామ్ ట్రాన్స్‌లేటర్ పాత్ర చాలా కీలకం. మోడల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎంత ముఖ్యమో ట్రాన్స్‌లేటర్ దాన్ని కమ్యూనికేట్ చేయడమూ అంతే కీలకం.

''ఏ వృత్తిలోనైనా భావోద్వేగాలతో కూడిన పనిలో ఒత్తిడి ఉంటుంది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి కొందరు ఈ వెబ్‌క్యామింగ్ మార్గం అనుసరిస్తుంటారు. ఈ రంగంలో వెబ్‌క్యామ్ ట్రాన్స్‌లేటర్ల పనిచూస్తే.. క్లయింట్లను కంఫర్టబుల్‌గా ఉంచడమే వీరి డ్యూటీ అనిపిస్తుంది. అదే సమయంలో మోడల్ తన పని తాను సక్రమంగా చేసేలా గైడ్ చేసే పనీ ఉంటుంది. అనురక్తి, విరక్తి రెండూ ఉండే ఉద్యోగాల గురించి ఎక్కడా వినలేదు’’ అంటారు వీరు.

''అక్కడ ట్రాన్స్‌లేటర్ కేవలం ఒక సంధానకర్తలా కూర్చోవాల్సిన పనిలేదు. మోడల్‌కు సలహాలిచ్చే పని చేయొచ్చు. అలా అని క్లయింటుకు నచ్చేలా మోడల్ రెస్పాండ్ కానప్పుడు ఆమె స్థానంలోకి వెళ్లాల్సిన పనేమీ ఉండదు. ఒకసారి నేను ఓ మోడల్‌తో పాటు కూర్చున్నాను. ఆమె ఇంగ్లిష్‌లో ఏమీ మాట్లాడలేదు. దాంతో ఆమె తరఫున నేనే మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు క్లయింట్ నా మాటలు విని... 'ఓ నువ్వు ట్రాన్స్‌లేటర్ సాయంతో అక్కడ ఉన్నావా.. అలా అయితే ఇక చాలు' అంటూ చాట్ రూం నుంచి వెళ్లిపోయాడు. అక్కడ అలాంటివారు కూడా ఉంటారు' అన్నారు సోఫియా.

'వాళ్లు జాయ్ కావాలని అడిగారనుకోండి.. దానర్థం హస్త ప్రయోగం ఎలా చేసుకోవాలో మీరు అక్కడ వారికి వివరించాలన్నమాట. రష్యా భాషలో ఇవి మరింత అసభ్యకరమైన భాషలోనే ఉంటాయి.

ఇంగ్లిష్‌లో కూడా ఈ సంభాషణలు అశ్లీలంగానే సాగుతాయి. ''నువ్వు నాతో సెక్స్ చేయాలని కోరుకుంటున్నాను. నువ్వు ఈ పనిలో ఎంత ఉత్సాహంగా ఉంటే అంత ఇష్టపడతాను'' అంటూ ఒక్కోసారి టైప్ చేయాల్సి ఉంటుంది' అంటూ అక్కడి పరిస్థితులను వివరించారు వీరు.

sofia

షిఫ్ట్‌కు 100 డాలర్లు టార్గెట్

ప్రతి క్యామ్ గర్ల్ తన షిఫ్ట్‌లో 100 డాలర్లు (సుమారు రూ. 8 వేలు) సంపాదించాలనుకుంటుంది. దీనికోసం తక్కువ వ్యవధులలో ఎక్కువ మంది కస్టమర్లతో సంభాషించడం కానీ... ఇద్దరు ముగ్గురు క్లయింట్లతో గంట, గంటన్నర చొప్పున సుదీర్ఘంగా సంభాషించడం కానీ చేస్తే ఈ మొత్తం సంపాదిస్తారు.

కానీ గంటల తరబడి ఎంగేజ్ కావడానికి చాలామంది క్లయింట్లు ఇష్టపడరు. క్లయింట్లలో ఎక్కువ మంది పెళ్లయినవారే ఉంటారు. వాళ్లు ఏదో ఒక సాకు చెప్పి తక్కువ సేపట్లోనే ముగిస్తారు.

అయితే, ట్రాన్స్‌లేటర్ల సహాయంతో జరిగే ఈ కమ్యూనికేషన్ చాలాసార్లు ఫేక్‌గానే ఉంటుంది. మోడల్ మాట్లాడేదానికి, చేసేదానికి సంబంధం లేకుండా వీరు ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేస్తుంటారు.

ఈ వ్యాపారమే ఒక ఫేక్. ఈ వెబ్‌క్యామ్ సంభాషణల్లోకి వచ్చేవారు భ్రమల్లో ఉంటారు.

చాలామంది క్లయింట్లు హడావుడి చేస్తుంటారు. అన్నీ తెలిసినవారిలా మాట్లాడుతుంటారు.

'నువ్వు ట్రాన్స్‌లేటర్‌ను పెట్టుకున్నావని నాకు తెలుసు. స్టూడియో నుంచి మాట్లాడుతున్నావు కదా' అంటుంటారు.

వెబ్‌క్యామ్ మోడళ్ల వస్త్రధారణ, మేకప్, స్టూడియో సెటప్ అలంకరణ అంతా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది.

ట్రాన్స్‌లేటర్ల మాటలు, క్లయింట్ల ఆకలి చూపులు, కెమెరా ఫ్రేమ్, ఎడిటర్ల ఇంటర్‌ప్రిటేషన్ అన్నీ అందులో భాగమే అని చెబుతున్నారు వీరు.

(జెనియా, సోఫియాలతో కలిపి జూలియా బాక్స్‌లర్ బీబీసీ రీల్స్ కథనం )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Webcam translators: The secret negotiators behind the obscene chats.. 'Is the model talking to you? The third man?'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X