అవును నిజం!: ఊరినే అమ్మకానికి పెట్టారు

లండన్: ఎక్కడైనా ఇల్లు, భూమి, ఫ్లాట్స్, అపార్ట్‌మెంట్లు అమ్మకానికి పెట్టడం సాధారణ విషయమే. కానీ, ఇక్కడ మాత్రం ఏకంగా ఒక ఊరినే అమ్మకానికి పెట్టేశారు. అవును ఇది నిజం. ఇంగ్లాండ్‌లోని నార్త్‌ యార్క్‌షైర్‌ ప్రాంతంలోని వెస్ట్‌ హెస్‌లెర్టాన్‌ అనే గ్రామాన్ని అమ్మకానికి పెట్టారు. ఇల్లు, వ్యవసాయ భూమితోపాటు అమ్మకానికి పెట్టడంతో పాటు కొనుగోలు దారులకు కొన్ని షరతలు కూడా విధించారు.

వివరాల్లోకివెళితే.. ఇంగ్లాండ్‌లోని వెస్ట్‌ హెస్‌లెర్టాన్‌ అనే గ్రామాన్ని అమ్మకానికి పెట్టారు. ఇక్కడ 43 అందమైన ఇళ్లతో పాటు రాజభవనం, పబ్‌, పెట్రోల్ బంక్ కూడా ఉన్నాయి. వీటన్నింటితో పాటు.. ఈ గ్రామంలో దాదాపు 2వేల ఎకరాల భూమి కూడా ఉంది.

కాగా, 50ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఈ ఊరు ఒకే కుటుంబం ఆధీనంలో ఉంది. దీని ధర 20 మిలియన్‌ పౌండ్స్‌ (సుమారు రూ. 189 కోట్లు) వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఊరులో ఉన్న ఒక రాజభవనంలోనే దాదాపు 21 బెడ్‌రూమ్స్‌ ఉన్నాయి.

West Heslerton: Entire village goes up for sale for £20m

ప్రస్తుతం ఈ గ్రామంలోని భూమి, ఇళ్ల ద్వారా ఏటా రూ. 4 కోట్ల వరకు అద్దె కూడా వస్తుండటం విశేషం. కాగా, ఈవ్‌ డానే అనే మహిళకు ఈ ఊరు వారసత్వంగా వచ్చింది. గత 50ఏళ్లుగా ఈ ఊరు బాధ్యతలను ఆమె చూసుకునేది.

అయితే, ఐదేళ్ల క్రితం ఈవ్‌ మరణించడంతో.. ఆమె వారసులు ఊరును అమ్మేందుకు నిర్ణయించారు. అయితే.. ఊరును కొనాలంటే కేవలం డబ్బులు చెల్లిస్తే సరిపోదు మరి.

West Heslerton: Entire village goes up for sale for £20m

ఊరుని చాలా జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, ఉన్న ఇళ్లను కూడా తొలగించవద్దని షరతు పెట్టారు. మరి వారి షరతులు నచ్చి , అంత భారీ సొమ్ము వెచ్చించి ఆ ఊరును ఎవరు దక్కించుకుంటారు వేచి చూడాల్సిందే. కాగా, ఇలాంటి ఊరు అమ్మకాలు గతంలో కూడా జరగడం గమానర్హం.

ఇది ఇలా ఉండగా, ఆ ఊరు వాతావరణం చాలా స్నేహ పూర్వకంగా ఉంటుందని అక్కడి వారు చెబుతున్నారు. ఈవ్ డానే చాలా మంచి వ్యక్తని, ఆమె హయాంలో అద్దెలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రకృతి రమణీయతతో ఎంతో అందంగా తమ ఊరు ఉంటుందని తెలిపారు. ఊరును కొనుగోలు చేసేవారు కూడా ఈవ్ లానే చూసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+