అమెరికా అధ్యక్షుడి సూపర్ పవర్స్ - తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
US President Trump Inauguration Day: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమైంది. ఈ రాత్రి అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అగ్రారాజ్య అధినేతకు ఎన్నో అధికారాలు.. మరెన్నో విధులు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండే అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ చర్చించుకునే అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక అధికారాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
అన్నీ ప్రత్యేకమే
అమెరికా అధ్యక్షుడికి ప్రపంచలోనే ప్రత్యేక స్థానం ఉంటుంది. అమెరికా పాలనా వ్యవస్థలో అధ్యక్షు డి వద్దే పాలనా విధానాలు, విదేశాంగ వ్యవహారాల వ్యూహ రచన ఫైనల్ అవుతాయి. మంత్రుల నియామకం, ప్రభుత్వ సంస్థలకు బాధ్యుల నియామకంపైనా తుది నిర్ణయం ప్రెసిడెంట్ కే ఉంటుంది. చట్టసభల ఆమోదం లేకుండా దేశాధ్యక్షుడు జారీ చేసే ఆదేశాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గా పేర్కొంటారు. అత్యవసర వ్యవహారాల్లో ఈ తరహా ఆదేశాలు ఇచ్చే అధికారం అధ్యక్షుడి కి ఉంటుంది. అమెరికాలో చేసే కొత్త చట్టాలపై అధ్యక్షుడికి పూర్తి నియంత్రణ ఉంటుంది. అమెరికా చట్టసభలు ఏటా ఒకసారి నిర్వహించే సంయుక్త సమావేశానికి దేశాధ్యక్షుడు అధ్యక్షత వహించి ప్రసంగిస్తారు. చట్టసభలకు దిశానిర్దేశం చేస్తారు.

వీటో అధికారాలు
అమెరికా అధ్యక్షుడికి వీటో పవర్ ఉంటుంది. దీని ద్వారా ఆయన అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లును కూడా తిరస్కరించగలరు. తన పాలనకు, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే బిల్లుల పైకి వీటో పవర్‌ను ప్రెసిడెంట్ ప్రయోగిస్తారు. అమెరికా అధ్యక్షుడు దేశ కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తారు. అన్ని సైనిక విభాగాలు ఆయన పరిధిలోనే పనిచేస్తాయి. సైన్యం మోహరింపు, సైనిక ఆపరేషన్ల నిర్వహణ వంటి వాటిపై ప్రెసిడెంట్ నుంచే ఆదేశాలు వెలువడతాయి. దేశ భద్రత కోసం, జాతీయ ప్రయోజనాల కోసం అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు.యుద్ధ సంబంధ నిర్ణయాలను నేరుగా తీసుకునే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అయితే, వాటిని 48 గంటల్లోకా అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేయాలి.
ప్రపంచ వ్యాప్తంగా
మరో దేశంపై యుద్దాన్ని ప్రకటించే అధికారం మాత్రం అమెరికా కాంగ్రెస్‌కే ఉంటుంది. తద్వారా అధ్యక్షుడి సైనిక శక్తులపై మాత్రం నిర్ణయాధికారం అధ్యక్షుడిదే. దౌత్య పరంగా ఇతర దేశాలతో సంప్రదింపులు.. హెచ్చరికలు...ఆంక్షల అధికారం అధ్యక్షుడి వద్దే ఉంటుంది. ఆయుధాల అమ్మకాలు, కొనుగోలు అధికారం సైతం ప్రెసిడెంట్ దే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఫెడరల్ కోర్టుల జడ్జీలను నియమించటంతో పాటుగా నేరాలకు పాల్పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంటుంది. కాగా, ఇప్పుడు అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు తరలి వస్తున్నారు.












Click it and Unblock the Notifications