ఈ ఏడాది ప్రపంచంలో టాప్-10 ఎయిర్ పోర్టులు ఏవంటే..?
నిత్యం ఉరుకులు పరుగులు అంటూ హడావిడిగా ఉండే నేటి ప్రపంచంలో.. విమానాశ్రయాలు ప్రయాణికులకు గుర్తుండిపోయే అనుభవాన్ని అందించే గమ్యస్థానాలుగా మారుతున్నాయి. తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకోవడానికి.. ఆహ్లాదకరమైన అనుభూతి వారికీ అందించేందుకు విమానాశ్రయాల మధ్య పోటీ గట్టిగానే ఉంది.
కాగా 'ట్రావెల్ ప్లస్ లీజర్' సంస్థ విమానాశ్రయాలకు ఈ ఏడాదికి ర్యాంకులతో పాటు అవార్డులను ప్రకటించింది. వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ 2025 జాబితాలో ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానం కైవసం చేసుకుంది. గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న సింగపూర్ చాంగి విమానాశ్రయాన్ని బీట్ చేసి 98.57 స్కోరుతో ముందు వరుసలో నిలిచింది.

ర్యాంకింగ్ నిర్ణయించే ప్రమాణాలు..
ఈ జాబితా రూపొందించడంలో ప్రయాణికుల అభిప్రాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రింది అంశాల ఆధారంగా విమానాశ్రయాలకు రేటింగ్ ఇస్తారు:
- ఎంట్రీ
- చెక్-ఇన్/సెక్యూరిటీ ప్రక్రియలు
- రెస్టారెంట్లు & బార్‌లు
- షాపింగ్
- విమానాశ్రయం డిజైన్ & శుభ్రత
టాప్ 10 విమానాశ్రయాల జాబితా..
1. ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ - 98.57
2. సింగపూర్ చాంగి - 95.20
3. హమద్ ఎయిర్‌పోర్ట్, దోహా - 92.34
4. జాయెద్ ఎయిర్‌పోర్ట్, అబుదాబి - 89.48
5. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ - 88.38
6. హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్ట్ - 86.22
7. హెల్సింకి-వాంటా, ఫిన్లాండ్ - 86.18
8. హనెడా, టోక్యో - 84.47
9. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్ - 84.23
10. ఇంచియాన్, దక్షిణ కొరియా - 83.67












Click it and Unblock the Notifications