మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్: ఏమిటీ అమెరికా బాంబు? ఢిల్లీపై పడితే..!?
ఆప్గనిస్తాన్‌లోని ఐసిస్ స్థావరాలు లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబు దాడి వల్ల ఐసిస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిని మదర్ ఆప్ ఆల్ బాంబ్స్ అంటారు.
న్యూఢిల్లీ: ఆప్గనిస్తాన్‌లోని ఐసిస్ స్థావరాలు లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబు దాడి వల్ల ఐసిస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిని మదర్ ఆప్ ఆల్ బాంబ్స్ అంటారు.
ఈ బాంబు గురించి..
- ఇది నాన్ న్యూక్లియర్ అతి పెద్ద బాంబు. దీనిని అల్బర్డ్ ఎల్ వీమోర్స్ట్ డెవలప్ చేశారు.
- ఈ బాంబును తొలిసారి 2003లో టెస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని ఎగ్లిన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో పరీక్షించారు.
- నాన్ న్యూక్లియర్ బాంబులలోని అతి ప్రమాదకరమైన బాంబు ఇది. కాబట్టి దీనిని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు.
- ఈ బాంబు ఎక్కడైతే బ్లాస్ట్ అవుతుందో అక్కడి నుంచి 20 మైళ్ల వరకు దాని స్మోక్ కమ్ముకుంటుంది.
- ఇది 21,600 పౌండ్ల బరువు ఉంటుంది. దీని విలువ 16 మిలియన్ డాలర్లు.
- ఇరాక్ ఆర్మీ పైన విజయం సాధించేందుకు తొలిసారి దీనిని తీసుకు వచ్చారు. సద్దాం హుస్సేన్‌ను టార్గెట్ చేసేందుకు డిజైన్ చేశారు.
- సులభంగా వెళ్లలేని గుహలు తదితర ప్రాంతాలలో దాడి చేయడానికి ఉపయోగపడుతుంది.

ఢిల్లీలో పడితే పరిస్థితి ఏమిటి?
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతిపెద్ద న్యూక్లియేతర బాంబు జీబీయూ43-బీ ఎంవోఏబీని ప్రయోగించింది. దీని దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
16 మిలియన్ల డాలర్ల నిర్మాణ వ్యయం, 21,600 పౌండ్లు కలిగిన ఈ బాంబు గాల్లోనే పేలిస్తే దాని రేడియేషన్ ప్రభావం 44 మమీటర్లు ఉంటుందని, ఇక థర్మల ్రేడియేషన్ గమనిస్తే 110 మీటర్ల వరకు భస్మం చేసే శక్తి ఉంటుందని అమెరికా న్యూక్లియర్, న్యూక్లియేతర బాంబుల విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ బాంబు కనుక ఢిల్లీలోని సెంట్రల్ పార్క్, కనౌట్ ప్రాంతంలో పడినట్లుగా భావిస్తే.. ఆ సమయంలో దాడి ప్రాంతానికి 300 మీటర్ల దూరం గానీ 4 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్‌లో గానీ ఉండి ఉంటే ప్రాణాలతో ప్రాణాలతో బయటపడవచ్చట. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న జనాభా దృష్ట్యా దీని తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందంటున్నారు. రెండువేలకు పైగా మృత్యువాత పడతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications