మొసలి కన్నా పెద్ద బల్లి ఇంటికొస్తే..(వీడియో)
థాయ్‌లాండ్: ఇళ్లల్లో గోడలపై తిరిగే బల్లులను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ, ఇక్కడ మొసలి కన్నా పెద్దగా ఉన్న ఓ బల్లి ఏకంగా ఓ ఇంటికి వెళ్లింది. అంతేగాక, ఆ ఇంటి తలుపు తెరిచేందుకూ ప్రయత్నించింది. దీంతో దాన్ని తరిమేసేందుకు ప్రయత్నించారు ఆ ఇంటి యజమానులు. ఈ ఘటన థాయ్‌లాండ్ దేశంలో చోటు చేసుకుంది.
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. మెల్లగా పాకుతూ ఇంటి మెట్ల నుంచి గుమ్మం వరకు వెళ్లింది. అనంతరం గోడకు తనతోక సహాయంతో నిల్చొని డోర్ కొట్టింది. కాగా, ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ పెద్ద ఆకారాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ఫోన్లో ఆ భారీ బల్లిని ఫొటోలు, వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో బల్లి కదులుతున్న ప్రతిసారి ఓ కుక్క అరుస్తున్న శబ్దం కూడా రికార్డయింది. తర్వాత ఓ తాడుతో ఆ బల్లిని బంధించేందుకు ప్రయత్నిస్తుండగా అది తన తోకతో ఆ డోర్‌ను ఈ డోర్‌ను కొడుతూ చేసిన హంగామా చేసింది.
అనంతరం ఆ బల్లిని బంధించి అడవిలో విడిచిపెట్టారు. కాగా, అత్యంత అరుదైన ఈ అతిధి సాధారణంగా ఆ ప్రాంతానికి తరచుగా వస్తుంటుందని స్థానికులు చెబుతున్నారు. దీన్ని సాలెనా అనే పేరుతో పిలుచుకుంటున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications