ట్రంప్ భార్య ఎక్కడ?.. వారం రోజులుగా 'నో అడ్రెస్'.. అదే కారణమా?

భర్త ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత మెలానియా మళ్లీ కనిపించలేదు. దీంతో ఆమె ఎక్కడికెళ్లి ఉంటారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

న్యూయార్క్: ఓవైపు షాకింగ్ నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీయులకు దడపుట్టిస్తుండగా.. ఆయన భార్య మెలానియా గతం వారం రోజుల నుంచి ఎక్కడా కనిపించకపోవడం చర్చలకు తావిస్తోంది.

గత వారం రోజులుగా మెలానియా మీడియా ముందుకు రాలేదు. దీనికి తోడు ఆమెకు సంబంధించిన ఏ వార్త లేకపోవడం అమెరికన్లలో చర్చకు దారితీసింది. భర్త ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత మెలానియా మళ్లీ కనిపించలేదు. దీంతో ఆమె ఎక్కడికెళ్లి ఉంటారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే, ట్రంప్ ప్రమాణ స్వీకారం నాడు.. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన మెలానియా.. ట్రంప్ ఏదో అనేసరికి నొచ్చుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆ తర్వాత మెలానియా వాషింగ్టన్ వదిలి న్యూయార్క్ కు వెళ్లిపోయారు.

Where s Melania? A quiet start for a reluctant first lady

తన పదేళ్ల కుమారుడు బారన్ ట్రంప్ పాఠశాల విద్యను పూర్తి చేయాల్సి ఉన్నందునా.. మరో స్కూల్ కు మార్చడం ఇష్టం లేకనే మెలానియా న్యూయార్క్ వెళ్లినట్టుగా చెబుతున్నారు. అయితే ఇదే అసలైన కారణమా? మరో కారణమేదైనా ఉందా? అన్న అనుమానాలను నెటిజెన్స్ లేవనెత్తుతున్నారు.

కాగా, అమెరికా తొలి మహిళగా ట్రంప్ భార్య మెలానియా ఇప్పటిదాకా తొలి మీడియా సమావేశం కూడా నిర్వహించకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+