కాబూల్ ఎయిర్ పోర్ట్ పై రాకెట్ దాడులు .. ధృవీకరించిన వైట్ హౌస్ ; తరలింపు ప్రక్రియపై కీలక ప్రకటన !!
ఆఫ్ఘనిస్తాన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కొనసాగుతోంది. కాబూల్ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసుకొని ఉగ్ర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై రాకెట్ దాడులు చోటుచేసుకున్నాయి .ఈ రాకెట్ దాడులను అమెరికా భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి.

తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది : వైట్ హౌస్
సోమవారం కాబూల్ విమానాశ్రయంలో ఐదు రాకెట్లు ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత, వైట్ హౌస్ దాడిని ధృవీకరించింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా తన దళాలను బయటకు తీసుకురావడానికి ఒక రోజు మాత్రమే డెడ్ లైన్ మిగిలి ఉన్న నేపథ్యంలో విమానాశ్రయంలో పౌరుల తరలింపు కోసం కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన రాకెట్ దాడి గురించి యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ కు సమాచారం అందించబడిందని , అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి చెప్పారు.

ఎయిర్ పోర్ట్ పై రాకెట్ దాడులు , పరిస్థితిపై బైడెన్ కు వివరించిన అధికారులు
హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన రాకెట్ దాడి గురించి జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మరియు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లైన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వివరించారు. కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని కూడా వారు అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్ళారు . ఆఫ్ఘనిస్థాన్లో యూఎస్ దళాలను రక్షించడానికి అవసరమైన చర్యలను చేపట్టడానికి ప్రాధాన్యతనివ్వడానికి కమాండర్లు తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు ఇచ్చారని జెన్ సాకి వెల్లడించారు.

క్షిపణి రక్షణా వ్యవస్థ ద్వారా సమర్ధంగా తిప్పికొట్టామని వెల్లడి
కాబూల్ విమానాశ్రయం వద్ద ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా రాకెట్ల ప్రయోగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాము అని జెన్ సాకి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కాబూల్ లో తాజా పరిణామాలతో ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి ఇతర దేశాలకు తరలి రావడానికి ప్రయత్నిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళన మధ్య బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎటునుంచి ఎట్లా దాడులు చేస్తారో తెలియని పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక మరోవైపు ఇతర దేశాలకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ లో నివాసం ఉంటున్న వారంతా రేపటి లోపు ఆఫ్ఘనిస్తాన్ లో ఖాళీ చేస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

తరలింపు ప్రక్రియ నిర్దేశిత లక్ష్యాలను రీచ్ అవ్వటంపై స్పష్టత లేదు
యూఎస్ తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేస్తున్నప్పటికీ ఎయిర్ పోర్టు దాకా రాలేని పరిస్థితులు చాలా మంది విదేశీ పౌరుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రేపటితో డెడ్లైన్ ముగుస్తున్న క్రమంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక పక్క తాలిబన్లు, మరోపక్క ఐసిస్ వంటి ఉగ్ర సంస్థలు ఆఫ్ఘనిస్థాన్ లో మరణ మృదంగం మోగిస్తున్న పరిస్థితి ఉంది. ఏఎఫ్‌పి నివేదిక ప్రకారం, తరలింపు ప్రక్రియలో నిర్దేశించుకున్న లక్ష్యం ఎక్కడి వరకు చేరుకుంది అన్నదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదని తెలుస్తుంది.

కాబూల్ లో దాడులు, ప్రతిదాడులు .. శవాల దిబ్బగా మారుతున్న కాబూల్
కాబూల్ విమానాశ్రయం వెలుపల ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐ కే ఆత్మాహుతి దాడిలో 160 మందికి పైగా ఆఫ్ఘన్ మరియు 13 యునైటెడ్ స్టేట్స్ సైనిక సిబ్బంది మరణించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గురువారం హృదయ విదారకమైన దృశ్యాలను చూసింది. మరణించిన యుఎస్ మిలిటరీ సిబ్బందిలో 11 మంది మెరైన్స్, ఒక నేవీ సెయిలర్ మరియు ఒక ఆర్మీ సైనికుడు ఉన్నారు, 18 మంది యుఎస్ సర్వీస్ సభ్యులు కూడా గురువారం గాయపడ్డారు. యూఎస్ దాడికి ప్రతీకారంగా ఇస్లామిక్ స్థావరాలపై దాడులు జరిపినప్పటికీ, ప్రస్తుతం కూడా కాబూల్ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసుకొని వరుస దాడులు కొనసాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.

ఇప్పటివరకు 1,14,400 మందిని సురక్షితంగా తరలించినట్లు సమాచారం
యునైటెడ్ స్టేట్స్ మరియు దాని మిత్రదేశాలు ఇప్పటివరకు 1,14,400 మందిని సురక్షితంగా తరలించినట్లు గా సమాచారం. ఆఫ్ఘన్ మరియు విదేశీ పౌరులతో సహా 114,400 మందిని సురక్షితంగా ఇతర దేశాలకు చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి యూఎస్ స్థలాలు ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆగస్టు 15 న తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇతర దేశాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ సోమవారం తరలింపు చర్యలు కొనసాగుతాయని అమెరికా అధికారులు చెప్పారు. ఇక తాజా పరిణామాలతో ఆగస్టు 31 వరకు పూర్తిస్థాయి తరలింపు ప్రక్రియ పూర్తవుతుందా అనేది పెద్ద ప్రశ్నగానే ఉంది.

తరలింపు రేపటి లోగా పూర్తి కాకుంటే ఏం జరుగుతుందో .. సర్వత్రా భయం
కాబూల్ ఎయిర్ పోర్ట్ నుండి ఇతర దేశాల ప్రజలు, సిబ్బంది తరలింపు రేపటితో పూర్తి కాకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాలు గడువు పొడిగించేలా తాలిబన్లతో చర్చలు జరపాలని యూఎస్ ను ప్రాధేయపడ్డాయి. తరలింపు ప్రక్రియ పై తాలిబన్ ముఖ్య నాయకులతో చర్చలు జరిపిన యూఎస్ ప్రభుత్వం, ఆగస్టు 31 వరకే తమ వారందరినీ తరలిస్తామని, గడువు పెంపు అవకాశం లేదని వెల్లడించింది. అయితే తరలింపు ప్రక్రియను అడ్డుకుంటూ కాబూల్ విమానాశ్రయం టార్గెట్ గా ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. ఉగ్ర దాడులను సమర్థంగా ఎదుర్కొంటూనే, కాబూల్ లో క్షీణిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో తరలింపు ప్రక్రియ సాగుతోంది. ఒకవేళ పూర్తిస్థాయిలో తరలింపు జరగకుంటే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఇతర దేశాల ప్రజల పరిస్థితి ఏమిటి అనేది ఆందోళన కలిగించే అంశం.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications