శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం! ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్ కు ఆహ్వానం!!
శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. త్వరలోనే తమ దేశంలో పర్యటించబోతున్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేరుకు బదులు ఒక పోర్న్ స్టార్ పేరును అధికారిక షెడ్యూల్ లో ప్రచురించింది.
వాషింగ్టన్: కొత్త అధ్యక్షుడి పాలనలోకి వచ్చిన శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. త్వరలోనే తమ దేశంలో పర్యటించబోతున్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేరుకు బదులు ఒక పోర్న్ స్టార్ పేరును అధికారిక షెడ్యూల్ లో ప్రచురించింది.
అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా మూడుసార్లు పేరును మార్చేసింది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న అధికారుల్లో ఒకరు ఆ షెడ్యూల్ కు సంబంధించిన పత్రంలో థెరిసా మే పేరు రాసేటప్పుడు అందులో 'హెచ్' అనే అక్షరాన్ని వదిలేశారు.

దాంతో ఆ పేరు కాస్తా 'టెరెసా మే'అయిపోయింది. కానీ అదే పేరుతో ఒక పోర్న్ స్టార్ ఉంది. వాస్తవానికి బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన అధికారిక పర్యటనలో భాగంగా ట్రంప్ తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడంతో పాటుగా సంయుక్త విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది.
వైట్ హస్ నుంచి ప్రతిరోజూ వచ్చే కార్యక్రమాల వివరాలలో భాగంగా ప్రెస్ సెక్రటరీ ఈ పర్యటన వివరాలను కూడా వెల్లడించారు. అందులో థెరిసా మే పేరులోని అక్షరాన్ని వదిలేయడంతో ఘోరమైన తప్పు జరిగిపోయింది.
టెరెసా మే గతంలో మోడల్ గా పని చేసి, ప్రస్తుతం పోర్న్ సినిమా స్టార్ గా ఉంది. గత వేసవి కాలంలో బ్రెగ్జిట్ నిర్ణయం అనంతరం నాటి ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయడంతో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఎవరవుతారనే చర్చ జరిగిన సందర్భంలో కూడా థెరెసా మే పేరుతోపాటు టెరెసా మే పేరు కూడా ట్విట్టర్ లో మారుమోగిపోయింది.
-
హార్మూజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా డ్రోన్.. 2 వేల కోట్లు గంగార్పణం.. -
ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!










Click it and Unblock the Notifications