వైట్ హౌజ్ సమీపంలో గన్ ఫైర్.. ఐదుగురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలోని అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. వైట్ హౌజ్ కు కిలోమీటరన్నర దూరంలోని వాషింగ్టన్ డీసీలోని లోగాన్ సర్కిల్ వద్ద జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఓ గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పులకు పాల్పడగా ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. దాంతో దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు కాల్పుల సంఘటన తర్వాత అధికారులు ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంతో పాటు.. ప్రజలు అటువైపు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఘటన జరిగిన ప్రదేశంలోని పాఠశాలల్లోనూ లాక్ డౌన్ విధించారు.
దుండగుడు తప్పించుకుని పారిపోయిన నేపథ్యంలో వాషింగ్టన్ లోని అనేక ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. పోలీసులతో పాటు ది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ ప్లోజివ్స్ సంస్థ కూడా తమ ఏజెంట్ లను మోహరించినట్లు పేర్కొంది. ఇక గతేడాది ఆగస్టులో ఇదే ప్రాంతంలోని లోగాన్ సర్కిల్ అమెరికా అధ్యక్షుడికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎఫీషియెన్సీ మెంబర్ ను ఓ టీనేజర్ గ్రూప్ వేధింపులకు పాల్పడింది. ఈ ఘటన తర్వాత వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో ఫెడరల్ కంట్రోల్ ను జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

ఇక మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం ప్రాంతంలో ఇటీవల జరిగిన కారు ప్రమాదం తర్వాత అక్కడ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ కారు ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాద సమయంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌజ్ భవనంలోనే ఉండటం గమనార్హం. ఇక ఈ ఘటన తర్వాత సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ అలాగే నేషనల్ గార్డ్ ట్రూప్స్ దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications
