ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతకు కరోనా భయం: సెల్ప్ క్వారంటైన్‌లోకి: వర్క్ ఫ్రమ్ హోమ్
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థకు కరోనా వైరస్ భయం పట్టుకుంది. కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను చుట్టబెట్టిసన ఈ మహమ్మారి డబ్ల్యూహెచ్‌ఓనూ ఆక్రమించేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 68 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డాడు. 12 లక్షల మందికి పైగా మరణించారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించే డబ్ల్యూహెచ్‌ఓపైనా కరోనా వైరస్ ప్రభావం పడింది. డబ్ల్యూహెచ్‌ఓ అధినేత టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెసెస్‌కు కరోనా భయం పట్టుకుంది.
Recommended Video
I have been identified as a contact of someone who has tested positive for #COVID19. I am well and without symptoms but will self-quarantine over the coming days, in line with @WHO protocols, and work from home.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 1, 2020
ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. తనను కలిసిన ఓ వ్యక్తి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారని, ఫలితంగా తాను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు టెడ్రోస్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదని తెలిపారు. కొన్ని రోజుల పాటు తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో గడపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

తన కార్యకలాపాలను ఇంటి నుంచే కొనసాగిస్తానని పేర్కొన్నారు. సెల్ఫ్ క్వారంటైన్ సందర్భంగా తాను డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తున్నానని అన్నారు. తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని టెడ్రోస్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఓ కారణమైందనే ఆరోపణలు ఇదివరకే వినిపించాయి. కరోనా వ్యాప్తి చెందిన అనంతరం.. దాన్ని సకాలంలో నియంత్రించలేకపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్‌ఓపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
I have been identified as a contact of someone who has tested positive for #COVID19. I am well and without symptoms but will self-quarantine over the coming days, in line with @WHO protocols, and work from home.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 1, 2020
అమెరికా వాటాగా ఆ సంస్థకు పంపించే నిధులను నిలిపివేశారు. కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన చైనాను సహకరించేలా, ఈ భయానక పరిస్థితుల నుంచి ఆ దేశాన్ని రక్షించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయాలను తీసుకుందంటూ డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ విషయంలో భారత్ సహా అనేక దేశాలు డొనాల్డ్ ట్రంప్‌తో ఏకీభవించాయి. ఈ పరిస్థితుల్లో ఏకంగా టెడ్రోస్ అరింథమ్‌కు కరోనా భయం పట్టుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
I have been identified as a contact of someone who has tested positive for #COVID19. I am well and without symptoms but will self-quarantine over the coming days, in line with @WHO protocols, and work from home.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 1, 2020

Click it and Unblock the Notifications