WHO: ఇండియాలో తయారైన ఆ దగ్గు మందు కలుషితమైంది.. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన..
ఓ భారతీయ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కలుషితమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)మంగళవారం తెలిపింది. మార్షల్ దీవులు, మైక్రోనేషియాలో ఈ కలుషిత దగ్గు మందును గుర్తంచినట్లు ప్రకటించింది. గత ఏడాది కొన్ని దేశాల్లో సంభవించిన పిల్లల మరణాలకు భారత్ లో తయారు చేసిన దగ్గు సిరప్‌లతో సంబంధం ఉన్న నేపథ్యంలో మరోసారి కలుషిత దగ్గు మందు తెరపైకి రావడం చర్చనీయంశంగా మారింది .
మార్షల్ దీవులు, మైక్రోనేషియాలో ఎవరైనా పిల్లలు ఈ దగ్గు మందుతో మృతి చెందారా లేక అనారోగ్యంతో ఉన్నారో లేదో WHO వెల్లడించలేదు. అయితే, దిగుమతి చేసుకున్న దగ్గు సిరప్‌లోని ఒక బ్యాచ్‌లోని నమూనాలు పరిశీలించగా.. గ్వైఫెనెసిన్ సిరప్ TG సిరప్ లో అధిక మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు పేర్కొంది. ఇవి మానవులకు విషపూరితమైనవి, ప్రాణాంతకంగా మారగలవని తెలిపింది. కాలుష్యాన్ని ఆస్ట్రేలియా రెగ్యులేటర్, థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ (TGA) గుర్తించిందని వివరించింది.

పంజాబ్‌కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్ లిమిటెడ్ ఈ దగ్గు మందును తయారు చేసిందని పేర్కొంది. ఈ దగ్గు మందును హరియాణాకు చెందిన థ్రిల్లియం ఫార్మా మార్కెటింగ్ చేస్తోందని తెలిపింది. గతంలో భారత్, ఇండోనేషియాలోని తయారు చేసిన ఈ సిరప్‌లు గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్‌లలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులకు దారితీశాయి. ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 300 కంటే ఎక్కువ మంది పిల్లల మరణించినట్లు వార్తలు వచ్చాయి.
డబ్య్లూహెచ్ఓ ప్రటనపై క్యూపీ ఫార్మాకెమ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ పాఠక్ స్పందించారు. స్థానిక రాష్ట్ర డ్రగ్ రెగ్యులేటర్ ఆదేశాలను అనుసరించి ఎగుమతి చేసిన బ్యాచ్ నుంచి నమూనాను పరీక్షించినట్లు చెప్పారు. మందు సరిగానే ఉన్నట్లు రెగ్యులేటర్ కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. 18,000 బాటిళ్ల సిరప్‌ను కంబోడియాకు మాత్రమే ఎగుమతి చేసేందుకు క్యూపీ ఫార్మాకెమ్‌కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని పాఠక్ చెప్పారు. మార్షల్ దీవులు, మైక్రోనేషియాలో సిరప్ ఎలా వెళ్లిందో తెలియదన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications