ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్?
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఆ దేశం చేస్తున్న దాడులు నాలుగో వారానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ జాతీయ భద్రతా ఛీఫ్ అలీ లారిజానీ ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన తర్వాత రెండో స్ధానంలో ఉన్న లారిజానీ కూడా చనిపోవడంతో ఇక ఆ దేశం కథ ముగిసిందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ఇరాన్ పోరాడుతూనే ఉంది. దానికి కారణం దాని అంచెలంచెల నాయకత్వమే. ఇందులో మరో కీలక నేతను లారిజానీ స్ధానంలో నియమిస్తూ ఇరాన్ ఇవాళ నిర్ణయం తీసుకుంది.
గత వారం హత్యకు గురైన అలీ లారిజానీ స్థానంలో, మహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ (Mohammad Zolghadr)ను సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త కార్యదర్శిగా నియమిస్తూ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. 1955లో జన్మించిన జోల్ఘదర్.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో రిటైర్డ్ కమాండర్‌గా పనిచేశారు. అక్కడ ఆయన బ్రిగేడియర్ జనరల్ స్థాయికి ఎదిగి, డిప్యూటీ కమాండర్, అసాధారణ యుద్ధ కార్యకలాపాల అధిపతి వంటి కీలక పదవులను నిర్వహించారు.

1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవానంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి, అన్సార్-ఎ హిజ్బుల్లా, మొజాహెదీన్ ఆఫ్ ది ఇస్లామిక్ రివల్యూషన్ ఆర్గనైజేషన్ వంటి అతివాద బృందాలలో చేరారు. 2020 వరకు ఎనిమిదేళ్లపాటు న్యాయవ్యవస్థ వ్యూహ విభాగ డిప్యూటీ చీఫ్‌తో సహా ఇరాన్ పాలనా నిర్మాణంలో అనేక ఉన్నత పదవులను నిర్వహించారు. జోల్ఘదర్ ఐఆర్‌జీసీ జాయింట్ స్టాఫ్ చీఫ్‌గా, ఐఆర్‌జీసీ డిప్యూటీ కమాండర్-ఇన్-చీఫ్‌గా, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రత, శాంతిభద్రతల డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు. దీంతో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన్ను ఇరాన్ జాతీయ భద్రతా ఛీఫ్ గా నియమించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications