అమెరికా సెనేటర్ భార్యకు మోడీ క్షమాపణ.. ఇంతకీ సారీ ఎందుకంటే!!! (వీడియో)
Recommended Video
హౌడీ మోడీ సభతో హ్యుస్టన్ మారుమోగింది. భారత ప్రధాని మోడీ, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్.. సెనేటర్లు, అతిరథ మహారథులు హాజరుకాగా .. దాదాపు 50 వేల మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు హాజరయ్యారు. అయితే ఓ విచిత్రం జరిగింగి. సాక్షాత్ ప్రధాని మోడీ .. అమెరికా సెనేటర్ భార్యకు క్షమాపణ చెప్పారు. అదీ కూడా ఓ వీడియోలో .. ప్రధాని మోడీ సారీ చెప్తుండగా .. సెనేటర్ కూడా పక్కనే ఉండటం విశేషం.

ఏం జరిగిందంటే ..
అమెరికా పర్యటన కోసం యూఎస్ వెళ్లిన మోడీ .. హ్యుస్టన్‌లో హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధినేత ట్రంప్‌తో కలిసి వేదికను పంచుకొన్నారు. అయితే అంతకుముందు నేటర్ జాన్ కార్నివర్ భార్య శాండీకి మోడీ క్షమాపణ చెప్పారు. తన కార్యక్రమానికి హాజరైతే కృతజ్ఞతలు చెప్పాలి కదా.. సారీ చెప్పడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా ? అవును మోడీ నిజంగానే సారీ చెప్పారు. ఎందుకు క్షమాపణ చెప్పారో వివరించారు కూడా.

బర్త్ డే కదా ..
ఆదివారం జాన్ భార్య పుట్టినరోజు. ఆ రోజు ఆమె 60వ ఏట అడుగిడారు. ఎవరైనా సాధారణంగా సెలబ్రేషన్స్ ఇంటి వద్ద ఫ్యామిలీ మెంబర్స్‌తో జరుపుకోవాలని భావిస్తారు. అయితే హౌడీ మోడీ సభ వల్ల జాన్ .. భార్యతో గడపలేకపోయారు. విషయం తెలుసుకున్న మోడీ .. తనదైనశైలిలో స్పందించారు. జాన్‌తో కలిసి ఓ వీడియోలో మాట్లాడారు. హ్యాపీ బర్త్ డే, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

జలసీ కామనే...
బర్త్ డే రోజున భర్త ఇంట్లో లేకపోతే ఎవరికైనా కోపం వస్తోంది. ఆ విషయం నాకు తెలుసు అని మోడీ పేర్కొన్నారు. మీకు నేనంటే జాలసీ కూడా కలిగి ఉండొచ్చని తెలిపారు. మోడీ వీడియోలో మాట్లాడుతున్నంత సేపు .. జాన్ పక్కనే ఉన్నారు. జాన్-సాండీ దంపతులకు 40 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కూమార్తెలు కూడా ఉన్నారు.
వీడియో వైరల్
జాన్ ప్రస్తుతం టెక్సాస్ సెనేటర్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హ్యుస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ సభ కోసం రిపబ్లికన్, డెమోక్రటిక్ నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు 50 వేల మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు అటెండయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత మోడీ సెనేటర్ భార్యకు క్షమాపణ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications