వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోబోలతో సెక్స్ చేస్తే.. ఆ ఫీలింగ్ మనుషులతోను రాదట!

|
Google Oneindia TeluguNews

అమెరికా : ప్రపంచీకరణ ప్రభావం ప్రస్తుత మానవ సంబంధాలను అత్యంత యాంత్రికంగా మార్చేస్తున్న తరుణంలో.. రాబోయే రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సంబంధాలు యాంత్రికతకే పరిమితమవనున్నాయి. ఇప్పటికే శక్తి సామర్థ్యాల్లో తనను మించిన మెషీన్లను, రోబోటిక్స్ ను తయారు చేసుకున్న మానవుడు.. ఆఖరికి పడక సుఖాన్ని కూడా రోబోల ద్వారా పొందడానికి సిద్దమవుతున్నాడు.

తాజాగా సెక్స్ రోబోల మీద ప్రయోగాలు జరుపుతోన్న నిపుణులు.. ప్రేమికులు, భర్తల కంటే గొప్ప పడక సుఖాన్ని అందించే రోబో లవర్స్/రోబో భర్తలను పనిచేసే పనిలో పడ్డారు. పడక గదిలో తమను కొనుగోలు చేసిన వ్యక్తుల అభిరుచులకు అనుగుణంగా ఈ సెక్స్ రోబోలు వ్యవహరిస్తాయట. కిన్ వుడ్ కాలేజీకి చెందిన రోబోటిక్‌ నిపుణుడు జోయెల్ స్నెల్ ఇదే విషయాన్ని వెల్లడించారు.

WHY ROBOTS MIGHT BE BETTER LOVERS THAN HUMANS

మనుషుల కంటే రోబోలే అత్యుత్తమంగా వ్యవహరిస్తాయని.. మానవ సంబంధాల్లో సాధ్యం కాని సెక్స్ రీతులను సైతం ఈ సెక్స్ రోబోల ద్వారా అనుభవించవచ్చునని చెబుతున్నారు జోయ్ స్నెల్. మనుషులకు బదులు రోబోలతో సెక్స్ చేయడం ఆధునిక మానవుడికి ఓ వ్యసనంలా తయారయ్యే రోజులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సెక్సువల్ క్రైమ్స్ పై పోరాటం చేయడానికి కూడా ఈ రోబోలు ఉపకరిస్తాయనేది వారి వాదన.

సురక్షితమైన సెక్స్ తో పాటు అత్యంత క్రియేటివిటిగా సెక్స్ ద్వారా అనుభూతి చెందాలనుకునే వారికి వీటిని మించినవేమి లేవని అంటున్నారు జోయ్. మరోపక్క సెక్సాలజిస్టులు, ప్రజాస్వామిక వాదులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మనుషుల మధ్య సెక్స్ సంబంధాలకు రోబోలు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని, ఇలా సెక్స్ రోబోలను ప్రోత్సహించడం మంచిది కాదని సెక్స్ థెరపిస్ట్ గుర్ ప్రీత్ సింగ్ హెచ్చరిస్తున్నారు.

English summary
Artificial intelligence is already mildly terrifying. If you've seen robot movies like Ex Machina or I, Robot, you already know humans should never mess with cyborgs. Because they're definitely going to kill us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X