ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి రిజెక్ట్..? అసలు కారణం ఇదే..!
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలంటూ.. అందుకు తానే అర్హుడినంటూ మొన్నటి దాకా చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాను యుద్ధాలను ఆపేశానని ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పానని చెప్పుకొని తిరిగారు. అక్టోబర్ 10 శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఏటా పోటీ అధికంగా ఉంటుంది. మరి ఈ ఏడాది ఈ అవార్డు ఎవరిని వరిస్తుందో చూడాలి. అయితే ఈ అవార్డు తనకే దక్కాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను 7 యుద్ధాలను ఆపేశానని ప్రకటించుకుంటున్నారు. ఇటీవల యూఎన్జీఏ 80 వ వార్షిక సమావేశంలోనూ ట్రంప్ ప్రసంగిస్తూ.. అందరూ తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు.
ఇదే విషయంపై నోబెల్ కమిటీని ట్రంప్ ప్రశ్నించారు. నోబెల్ శాంతి బహుమతిని ఒబామాకు ఇచ్చారని.. అతనికి ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. అతను నోబెల్ ప్రైజ్ గురించి ఆ 15 సెకండ్లు మాత్రమే ఆలోచించాడని.. కానీ తాను ఏళ్లుగా నోబెల్ ప్రైజ్ కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. 2020 లో ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ స్థానంలో తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే జపాన్, పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు ట్రంప్ ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
ట్రంప్ కు రాకపోవడానికి కారణాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓస్లో హెడ్ నినా గ్రేగర్ ఇదే విషయంపై స్పందించారు. " గాజా సంక్షోభం విషయంలో ట్రంప్ శాంతిని నెలకొల్పినా.. ట్రంప్ తీసుకున్న అనేక పాలసీలు.. ఆల్ ఫ్రెడ్ నోబెల్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయి. సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు, సోదరభావం కలిగిఉండాలని తెలిపారు.

అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికాను దూరం చేశారని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అనేక దేశాలపై టారిఫ్ లు విధించారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ను మోహరించడం, యూనివర్సీటీల హక్కులను హరించడం, అలాగే ఇరాన్ పై ట్రంప్ దాడి, ఇజ్రాయెల్ కు ఆయుధాలు సరఫరా చేయడం.. లాంటి అనేక ఘటనలు ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోవడానికి గల కారణాలుగా చెప్పవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications