వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా ఇలా-హిల్లరీ అలా: ట్రంప్ ఎందుకు గెలిచాడంటే..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వైట్ వర్కింగ్ క్లాస్ ఓటర్ల కారణంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయనకు శ్వేతజాతీయుల నుంచి మంచి మద్దతు లభించింది. అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ రేసులో ఉన్నారు.

హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చాలామంది భావించారు. పలు సర్వేల్లోను ఆమెనే ముందంజలో ఉన్నారు. ప్రతి నేషనల్ పోల్‌లో ఆమె ముందున్నారు. కానీ ఎన్నికల్లో అంతా రివర్స్ అయింది.

అమెరికాలో సంప్రదాయ ఓటర్లు, ఇటీవల జరగిన అమెరికన్ ఎలక్షన్స్ తీరు చూస్తే హిల్లరీ క్లింటన్ గెలుస్తుందనే అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

దివాళా నుంచి... గతంలోను అధ్యక్ష పదవికి ట్రంప్ ప్రయత్నాలుదివాళా నుంచి... గతంలోను అధ్యక్ష పదవికి ట్రంప్ ప్రయత్నాలు

2012 ఎన్నికల్లో బరాక్ ఒబామా రెండోసారి గెలుపొందారు. ఆ సమయంలో ఆయనకు వైట్ ఓటర్స్ మద్దతు అంతగా లేదు. వాల్తేర్ మోండేల్ (వైస్ ప్రెసిడెంట్) నుంచి చూసుకుంటే వైట్ వోటర్స్ డెమోక్రటిక్ అభ్యర్థికి తక్కువగా మద్దతు పలకడం బరాక్ ఒబామాకే.

Why Trump Won: Working-Class Whites

డెమోక్రటిక్ పార్టీ వైట్ ఓటర్ల పైన నమ్మకం పెట్టుకుంది. అయితే, వైట్ వైట్ వర్కింగ్ క్లాస్ ఓటర్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గారు. (అందుకు ఆయన వ్యాఖ్యలూ కారణం) డెమోక్రటిక్ పార్టీ ఆశలు పెట్టుకున్న పలుచోట్ల ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గు చూపారు.

పెన్సిల్వేనియాలోని వ్యోమింగ్ రివర్ వ్యాలీతో పాటు స్కార్టాన్, విల్క్స్ బారే తదితర ప్రాంతాలు ట్రంప్ వైపు మొగ్గు చూపాయి. ఈ ప్రాంతాలు గతంలో ఒబామాకు ఓటు వేశాయి.

ఓహియో రాష్ట్రంలోని యంగ్‌స్టోన్‌లో 2012లో ఒబామా ఇరవై పాయింట్లతో గెలుపొందారు. ఇక్కడ రివర్స్ అయింది. డెమోక్రటిక్ సంప్రదాయ ఓటర్లను ట్రంప్ తమ వైపు లాక్కున్నారు. అలాగే లేక్ ఏరీ ప్రాంతంలోని పాత ఇండస్ట్రియల్ టౌన్స్‌లోను ట్రంప్ తన వైపు మరల్చుకున్నాడు. 2012లో ఒబామాకు మద్దతు పలికారు. ఇప్పుడు అక్కడే ట్రంప్ 20 పాయింట్లతో గెలుపొందారు.

ర్త్ గ్రామీణ ప్రాంతాల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓట్లు వెల్లువెత్తాయి. అయోవాలో 2012లో ఒబామా సులభంగా నెగ్గారు. ఇప్పుడు అక్కడ ట్రంప్ వైపు మొగ్గు చూపారు. తూర్పు ప్రాంతం విస్కోన్సిన్, మిచిగాన్, న్యూ ఇంగ్లాండ్‌ వరకు ట్రంప్ వైపు మొగ్గు చూపారు.

Why Trump Won: Working-Class Whites

మెయినీ సెకండ్ కాంగ్రెస్సెనల్ డిస్ట్రిక్ట్‌లో ట్రంప్ 12 పాయింట్లతో నెగ్గారు. అదే ఒబామా 8 పాయింట్స్‌తో అప్పుడు గెలుపొందారు.

ఇలాంటి లబ్ధి కారణంగా అందరూ భావించిన దానికి భిన్నంగా ఫలితాలు కనిపించాయి. ఎక్కడికి అక్కడ వైట్ వర్కింగ్ ఓటర్స్ ఎక్కువగా ట్రంప్‌కు మద్దతు పలకడంతో అందరు ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. (హిల్లరీ ఓడిపోయారు)

నార్తర్నస్ ప్రాంతంలో వైట్ వర్కింగ్ క్లాస్ నుంచి ఒబామాకు మద్దతు లభించింది. ఇక్కడ ఇప్పుడు డెమోక్రాట్లకు దెబ్బ తగిలిందని తెలుస్తోంది.

1984 నుంచి వైట్ వోటర్స్ మద్దతు అతి తక్కువగా లభించిన డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరంటే బరాక్ ఒబామానే.

వైట్ వర్కింగ్ ఓటర్స్ డెమోక్రటిక్ వైపు ఉంటారని చాలా ఎగ్జిట్ పోల్స్ భావించాయి. అయితే నార్త్ వైట్ ఓటర్స్, వెల్ ఎడ్యుకేటెడ్ విషయంలో సర్వేలు ఎక్కువగా అంచనా వేశాయి.

Why Trump Won: Working-Class Whites

2012 ఎన్నికల అనంతరం 45 ఏళ్లకు పైనున్న వైట్ వర్కింగ్ క్లాస్ ఓటర్లు పది మిలియన్లుగా తక్కువగా అంచనా వేశారని తెలుస్తోంది. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో వారు ఆయనకు మద్దతు పలికారు. వైట్ వర్కింగ్ ఓటర్లను తక్కువగా అంచనా వేయడంతో.. ట్రంప్ అలా మాట్లాడినా రేసులో హిల్లరీ క్లింటనే ఉందని చాలామంది భావించారు.

ఎన్నికలకు ముందు ఎక్కువ శాతం మంది హిల్లరీ గెలుస్తుందని భావించారు. ట్రంప్‌కు గెలుపు అవకాశాలు 15 శాతంగా కనిపించాయని చెబుతున్నారు. తెల్లవారు అధికంగా ట్రంప్‌కు మద్దతు పలికారు. 37 శాతం మంది హిల్లరీకి, 39 శాతం మంది ట్రంప్‌కు అండగా నిలబడ్డారు.

ఒబామా పోటీ పడినప్పుడు మొత్తం ఓటర్లలో ఆఫ్రికన్ అమెరికన్లు పదమూడు శాతం ఉండగా, ఈసారి వారి సంఖ్య పన్నెండు శాతానికి తగ్గింది. ఇది కూడా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసింది.

ఓటర్లలో ఆసియా మూలాలు ఉన్న వారి సంఖ్య నాలుగు శఆతం ఉంది. వీరు గతంలో ఒబామాకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు హిల్లరీకి అంతగా అండగా నిలబడలేదు.

మెక్సికో నుంచి అక్రమ వలసదార్లు అమెరికాలో అడుగు పెట్టకుండా గోడ కడతానని చెప్పినా.. లాటిన్ అమెరికన్ ఓటర్లు హిల్లరీ వైపు మొగ్గు చూపలేదు. యువ ఓటర్లు గతంలో ఒబామాకు అండగా నిలిచినంత ఈసారి హిల్లరీకి నిలవలేదు.

English summary
Donald Trump won the presidency by riding an enormous wave of support among white working-class voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X