ప్రేమబంధం: భర్త శవాన్ని ఇంట్లోనే పెట్టుకుంది

లండన్: ఓ మహిళ తన భర్తపై పెంచుకున్న ప్రేమను వదులుకోలేకపోయింది. అతను మరణించినా అతడ్ని దూరం చేసుకునేందుకు ఆమె మనసు అంగీకరించలేదు. దీంతో ఆమె తన భర్త మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌కి చెందిన రిచర్డ్‌ బ్రౌన్‌ రాయల్‌ నేషనల్‌ లైఫ్‌బోట్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఇతను అనారోగ్యంతో చనిపోయాడు. ఉన్నట్టుండి భర్త మరణించడంతో అతని భార్య సూజాన్‌ తట్టుకోలేపోయింది.

అంత్యక్రియలు చేస్తే తన భర్త శాశ్వతంగా దూరమైపోతాడని భావించిన ఆమె.. ఆయన మృతదేహాన్ని ఓ దుప్పట్లో చుట్టి ఇంట్లోనే పెట్టేసుకుంది. భర్తను పోగొట్టుకున్న సూజాన్‌ని పలకరిద్దామని వారికి తెలిసిన ఓ పోలీసు అధికారి ఇంటికి వెళ్లాడు.

Wife kept her dead husband's body for six weeks because she couldn't bear to be apart from him

అప్పుడే రిచర్డ్‌ మృతదేహం బయటపడింది. అతను చనిపోయి నెలరోజులకుపైగా గడుస్తున్నా... ఇప్పటికీ మృతేదేహాన్ని ఇంట్లోనే పెట్టుకోవడంతో సూజాన్‌పై అనుమానం వచ్చి పోలీసులు ఆమెని అరెస్ట్‌ చేశారు.

రిచర్డ్‌ న్యూయర్‌ రోజున చనిపోయాడని తనని వదులుకోలేక ఇంట్లోనే పెట్టుకున్నానని సూజాన్‌ పోలీసులకు వివరించింది. అతను చనిపోవడానికి కారణాలు తెలియడంలేదని వైద్యులు చెప్పారు. దీంతో పోలీసులు అతని మృతేదహాన్ని వెంటనే పూడ్చేసే ఏర్పాట్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+