సరదా ప్రాణం తీసింది! జోక్ చేస్తూ భర్తపైకి చాకు విసిరిన భార్య, మృతి
కైరో: ఓ భార్య తన భర్తను అనుకోకుండా చంపేసింది! భార్యాభర్తలు జోక్ చేసుకుంటున్న సమయంలో.. ఆమె నవ్వుతూ కత్తిని అతని పైకి విసిరింది. అది అతని గుండెల్లోకి చొచ్చుకెళ్లడంతో అతను మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఈజిప్టులో జరిగింది.
ఈ వార్త గురువారం నాడు ఈజిప్టులోని స్థానిక వార్తాపత్రికలలో వచ్చింది. హలా తలాత్ (20). ఆమె భర్త ముస్తఫా జాడ్ (30). వీరిద్దరికి కొద్ది నెలల క్రితం వివాహం జరిగింది.
కైరో పట్టణంలోని సౌత్ ప్రాంతంలోని తమ అపార్టుమెంటులో డిన్నర్ చేసిన అనంతరం వారు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో భార్య తన భర్త పైకి పేపర్ విసిరేసింది. ఆ తర్వాత మరికొన్ని వస్తువులను సరదాగా విసిరేసింది.

అలాగే ఆమె ఓ చాకును కూడా అతని పైకి విసిరేసింది. అది అతని చాతికి గుచ్చుకుంది. అతని గుండెకు గాయమైంది. దాంతో అతను మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు భార్యను అరెస్టు చేశారు. ఆమె మూడు నెలల గర్భిణి. తనకు తన భర్త అంటే చాలా ప్రేమ అని, తాను సరదాగా వస్తువులు విసిరేస్తూ.. అలాగే చాకును కూడా విసిరేశానని, ఈ సంఘటన తనను జీవితాంతం వేధిస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications