'సెక్స్ తోనే భర్తను చంపేయాలనుకున్న భార్య', ఎలా..?

Subscribe to Oneindia Telugu

నైరోబీ : పరాయి స్త్రీల మోజులో భార్యలను లెక్కచేయలేని మగ మహారాజులు చాలామందే ఉంటారు. నయాన్నో భయాన్నో దారి తెచ్చుకోవడానికి ప్రయత్నించే భార్యలు కొంతమందైతే.. తనను పట్టించుకోనివాడు అసలు ప్రాణాలతోనే ఉండకూడదన్న కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడేవాళ్లు మరికొంతమంది.

రెండో కోవకు చెందిన బీట్రస్ అనే ఓ భార్య తన భర్త వాకర్ ను హత్య చేయడానికి ప్రయత్నించిన తీరు కెన్యాలో సంచలనంగా మారింది. భర్తకు వేరే మహిళలతో సంబంధాలున్నాయన్న అనుమానం ఆమెను ఈ చర్యకు పురికొల్పగా.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా.. సెక్స్ ప్రియుడైన భర్తను సెక్స్ ద్వారానే చంపేయాలని నిర్ణయించుకుంది బ్రీటస్. పెళ్లయి నాలుగేళ్లు తిరగకుండానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం ఆమెలో తీవ్ర అసహనాన్ని రేపింది.

Wife Wants to kill her husband through sex in kenya

దీంతో గత గురువారం తన ప్లాన్ ను అమలు చేసి భర్త వాకర్ ను హత్య చేయాలని భావించింది బ్రీటస్. ఇందుకోసం తన జననాంగానికి అత్యంత విషపూరిత రసాయనాన్ని పూసి భర్తను సెక్స్ లోకి దింపే ప్రయత్నం చేసింది. అయితే బ్రీటస్ జననాంగం నుంచి వస్తోన్న వాసనతో భర్త వాకర్ లో అనుమానం మొదలైంది. చివరికి అతని అనుమానం బలపడడంతో.. భార్య బ్రీటస్ ప్లాన్ బెడిసికొట్టింది.

ఇదే విషయమై భర్త వాకర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో హత్యాయత్నంపై విచారణ జరిపిన కోర్టు బ్రీటస్ కు పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది. తన భార్య ఎప్పటినుంచో తనను హత్య చేయాలని చూస్తోందని.. అందుకే ఆమె చేతులు మీదుగా మంచినీళ్లు ఇచ్చినా తాగడం మానేశానని భర్త వాకర్ పేర్కొనడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Wife planned to kill her husband through sex in kenya. She applied a poisonous chemical to her vagina and invited her husband for sex

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి