అమెరికా అధ్యక్ష బరిలో హిల్లరీ: లోగో దొంగిలించారని వికీలీక్స్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న హిల్లరీ క్లింటన్‌కు వికీలీక్స్ షాకిచ్చింది. తమ ట్విట్టర్ లోగో ఇన్నోవేటివ్‌ను హిల్లరీ చోరీ చేశారని ఆరోపించింది. ఆమె ఎన్నికల చిహ్నం కోసం తయారు చేసిన లోగో తమదేనని తెలిపింది.
హిల్లరీ తమ ఇన్నోవేటివ్ వికీలిక్స్ ట్విట్టర్ లోగో డిజైన్ కాజేశారని వికీలీక్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. అంతేకాదు, తమ లోగోను, హిల్లరీ ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసిన లోగోను పక్కపక్కన ఉంచి పోలికలను వివరించింది. కాగా లోగో విషయంలో ఈ సంవత్సరం విమర్శలు ఎదుర్కొంటున్న తొలి రాజకీయ నాయకురాలు హిల్లరీయే.
కాగా, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆదేశ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండటంతో ఈ మేరకు డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆమె ఆన్‌లైన్ మీడియాలో ప్రకటించారు.

అమెరికా ప్రజల ఆశలను, మనోభావాలను కూడా ఆ వీడియోలో పొందుపరిచారు. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు కావాలనుకుంటున్న హిల్లరీ త్వరలో ఆదేశంలోని వివిధ రాష్ర్టాలలో ప్రచారం చేపట్టనున్నారు. తొలిగా ఆమె నోవా రాష్ట్రంలో విద్యార్ధులు, టీచర్లు, చిన్నతరహా వ్యాపారులను కలుసుకుంటారు.
ఇదిలా ఉండగా, హిల్లరీ క్లింటన్ అద్భుతమైన అధ్యక్షురాలిగా నిలుస్తారని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఒపీనియన్ పోల్‌లో సైతం హిల్లరీకే 60 శాతం మంది మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో పనామా సిటీలో జరిగిన ఒక సదస్సులో ఒబామా మాట్లాడుతూ హిల్లరీపై ప్రశంసల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications