డ్రాగన్ కంట్రీని తగలబెట్టేస్తున్న కార్చిచ్చు.. యాక్షన్ లోకి 3వేల మంది !
చైనాలో కార్చిచ్చు భయాందోళనకు గురి చేస్తోంది. ఉత్తర చైనాలోని షాన్‌షీ రాష్ట్రం లోని లింగ్‌చౌన్ జిల్లాలో మంగళవారం భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయడానికి అక్కడి అధికారులు భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. ఇప్పటి వరకు 3,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు అక్కడ పనిచేస్తున్నాయి.
ఈ మంటలు మొదటగా శనివారం హుగువాన్ అనే దగ్గర చెలరేగాయి. ఆదివారం రోజున బలమైన గాలుల కారణంగా మంటలు పక్కనే ఉన్న లింగ్చువాన్ లోని లియుక్వాన్ ప్రాంతానికి వ్యాపించాయి. వాతావరణం పొడి గా ఉండడం, చెట్లు, పొదలు తక్కువ సమయంలోనే మంటకు చిక్కిపోవడం వల్ల మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. వాటిని ఆపేందుకు ఐదు హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు.

ఇప్పటివరకు 266 మందిని ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా తరలించారు. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు తెలియదు. అయితే అగ్ని నియంత్రణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దట్టమైన అడవులు, ఎత్తైన పర్వత ప్రాంతం, బలమైన గాలులు వంటి పరిస్థితుల వల్ల మంటలను ఆర్పడం చాలా కష్టం అవుతోందని అధికారులు చెబుతున్నారు. సహాయక బృందాలు మంటలను ఆర్పేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు త్వరగా అదుపులోకి రాకపోతే నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications