ఫేస్‌బుక్: లైక్‌తోపాటు లవ్, హాహా, యాంగ్రీ(వీడియో)
న్యూయార్క్: సామాజిక మాద్యమమైన ఫేస్‌బుక్‌లో మరికొన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నారు. ‘లైక్' తరహాలో మరికొన్ని భావాలకు సంబంధించిన ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫేస్‌బుక్ సిద్ధమైంది.
రియాక్షన్స్ పేరిట తీసుకొచ్చే ఈ ఫీచర్‌లో లవ్, హాహా, వావ్, శాడ్, యాంగ్రీ ఉన్నాయి. ఈ రియాక్షన్లను ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ కూడా ఆమోదించినట్లు సమాచారం. వీటిని స్పెయిన్, ఐర్లాండ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

ఈ రియాక్షన్లలో ‘యే'ని కూడా పెట్టినా దానికి తగిన స్పందన రాలేదు. దీంతో దీన్ని రద్దుచేయనున్నారు.
ఫేస్‌బుక్‌లో ఇతరుల వ్యాఖ్యలు, పోస్ట్‌లను ఇప్పుడు కేవలం ‘లైక్' మాత్రమే చేయగలుగుతున్నాం. కాగా, రియాక్షన్స్ అందుబాటులోకి వస్తే.. ప్రేమ.. హాస్యం.. ఆశ్చర్యం.. విచారం.. కోపం తదితర భావాలనూ వ్యక్తీకరించే వీలుండనుంది.












Click it and Unblock the Notifications