'2017లో ఒబామా చనిపోవాలి, మిచెల్లీ గుహలో చింపాంజీతో ఉండాలి'
ట్రంప్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షులు బరాక్ ఒబామా 2017లో చనిపోతారని, మిచెల్లీ ఒబామా ఆఫ్రికాకు వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనని అన్నాడు.
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షులు బరాక్ ఒబామా 2017లో చనిపోతారని, ఆయన భార్య మిచెల్లీ ఒబామా ఆఫ్రికాకు వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనని పరుష వ్యాఖ్యలు చేశాడు.
2017లో ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారని ట్రంప్ వర్గానికి చెందిన వ్యక్తిని మీడియా అడిగింది. దీనిపై పైవిధంగా స్పందించాడు.

ట్రంప్ ప్రచార సమయంలో న్యూయార్క్‌కు సంబంధించి కార్ల్ పలాడినో అనే ఓ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నాయకుడు కో చైర్మన్‌గా పని చేశారు. ఆయన గతంలో న్యూయార్క్ గవర్నర్‌గా కూడా పని చేశారు. వచ్చే కొత్త ఏడాదిలో ఏం జరిగితే చూడాలని అనుకుంటున్నారని అడిగితే.. ఎద్దుల మందకు వచ్చే భయంకరమైన వ్యాధి ఒబామాకు వచ్చి ఆయనను పరీక్షలకు తీసుకెళ్లడానికి ముందే చనిపోవాలని కోరుకుంటున్నానని అన్నాడు.
ఆ తర్వాత మరో ఏడాదిలో మిచెల్లీ ఒబామా తిరిగి తన దేశం ఆఫ్రికాలోని జింబాబ్వేకు వెళ్లి అక్కడే ఓ చింపాంజీతో కలిసి గుహలో జీవించాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఈ మాటల పైన నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన పైన దుమ్మెత్తి పోస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications